టెన్త్ క్లాస్ విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ
"సురేష్ పట్నాయక్"
RTVNEWS (లవకుశ)కొయ్యూరు మండలంలో డౌనురు ఎంపీటీసీ సిగ్మెట్ పరిధిలో గల మూలపేట చిట్టెంపాడు గదభ పాలెం,డౌనురు పంచాయతీల్లో 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులందరికీ స్టేషనరీ ఇవ్వడం జరుగుతుందని డౌనురు గ్రామానికి చెందిన సురేష్ పట్నాయక్ తెలిపారు. ఆదివారం వివిధ పంచాయతీలో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థి విద్యార్థులు 20 మందికి స్టేషనరీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యేవరకు ఈ నాలుగు పంచాయతీల నుండి ఎంతమంది విద్యార్థులు వచ్చినా వారందరికీ స్టేషనరీ ఇవ్వడం జరుగుతుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ పట్నాయక్ మాట్లాడుతూ టెన్త్ క్లాస్ విద్యార్థి విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు సక్రమంగా రాసి ఉన్నత లక్ష్యాలను అందిపుచ్చుకొని చదివిన ప్రాంతానికి తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.