ఎల్ పురం లో అంగన్వాడీలో ఘనంగా మహిళా దినోత్సవం
సెక్టార్ సూపర్వైజర్ సత్యశ్రీ
RTVNEWS (లవకుశ)మహిళలందరూ అన్ని రంగాల్లో రాణించాలని ఏ ఎల్ పురం సెక్టార్ సూపర్వైజర్ సత్య శ్రీ అన్నారు. శనివారం ఏ ఎల్ పురం అంగన్వాడి కేంద్రాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ సత్య శ్రీ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండి రాణించాలని పిలుపునిచ్చారు. అనంతరం గర్భవతులు, బాలింతలు , మహిళా దినోత్సవం వేడుకలు ను పురస్కరించుకొని ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఒకరికి ఒకరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రాజకుమారి, భవాని, మంగతాయారు, ధనలక్ష్మి, రాజకుమారి, విజయ కుమారి, ఆయాలు చిన్నారులు పాల్గొన్నారు