హెచ్ఎం సొంత నిధులతో పాఠశాలకు ఇనుప కంచె ఏర్పాటు
హెచ్ఎం "మామిడిమహేష్" ను అభినందిస్తున్న గ్రామస్తులు
RTVNEWS (లవకుశ)ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్ళామా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పమా అని బేరేజ్ వేసుకుంటున్న ఈరోజుల్లో కొత్తపాడి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మామిడి మహేష్ పాఠశాల ప్రాంగణం చుట్టూ ఇనుపకంచును తన సొంత నిధులతో ఏర్పాటు చేయించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. కొయ్యూరు మండలంకొండగోకిరి పంచాయితీ పరిధిలోగల కొత్త పాడి గ్రామంలో ఉన్న పాఠశాలకు ఎటువంటి రక్షణ కూడా లేకపోవడంతో విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని తన సొంత నిధులతో పాఠశాల ప్రాంగణం చుట్టూ ఇనుపకంచెను ఏర్పాటు చేయించారు. దీంతో పాఠశాలలో ఉన్న మొక్కలు కు రక్షణ తో పాటు విద్యార్థుల ఆటలాడుకుంటున్న సమయంలో ఎటువంటి అపాయం కలగకుండా ఉంటుందని పలువురు అభినందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలను తన సొంత ఆస్తిగా భావించి తన సొంత నిధులతో పాఠశాల ప్రాంగణం చుట్టూ ఇనుపకంచి ఏర్పాటు చేయించిన ప్రధానోపాధ్యాయులు మహేష్ ను సర్పంచ్ రేగటి ముసలి నాయుడు, విద్య కమిటీ చైర్మన్ పి మల్లేశ్వరరావు గ్రామస్తులు పలువురు అభినందనలతో ముంచేత్తుతున్నారు