అనారోగ్యంతో శరభన్నపాలెం ఎంపీటీసీ లోచల సోమ గాంధీ మృతి. వైసిపి పార్టీ నాయకులు సంతాపం

Rtv Rahul
0
శరభన్నపాలెం ఎంపీటీసీ అనారోగ్యంతో మృతి 
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు పార్టీ శ్రేణులు


RTVNEWS (లవకుశ)వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు శరభన్నపాలెం ఎంపీటీసీ లోకుల సోమ గాంధీ తీవ్ర అనారోగ్యంతో శుక్రవారం తెల్లవారుజామున విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొయ్యూరు మండలం శరభన్నపాలెం గ్రామానికి చెందిన సోమ గాంధీ వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భావం నుండి వైసీపీలో కొనసాగుతున్నారు. అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి స్వగ్రామం శరభన్నపాలెం సెగ్మెంట్ నుండి ఎంపీటీసీగా భారీ మెజార్టీతో గెలుపొందారు.  గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుత వైద్య సేవలు నిమిత్తం విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ జాయిన్ అయి చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆయన అంత్యక్రియలు  శరభన్నపాలెంలో నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలియజేశారు ఎంపీటీసీ సోమాగాంధీ మృతి చెందడంతో కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్ మండల పార్టీ అధ్యక్షుడు జల్లిబాబులు పార్టీ నాయకులు, సర్పంచులు ఎంపీటీసీలు సోమ గాంధీ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">