డోలు మోతలు లేని రహదారులు కావాలన్నదే కూటమి ప్రభుత్వం ధ్యేయం. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి ప్రత్యేక కృతజ్ఞతలు. మండల పార్టీ ప్రధాన కార్యదర్శి "తోట దొరబాబు"

Rtv Rahul
0
డోలుమెతలు లేని రహదారులు కావాలన్నదే కూటమి ప్రభుత్వం ధ్యేయం 

మా జీ ఎమ్మెల్యే ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరికి ప్రత్యేక కృతజ్ఞతలు

మండల టిడిపి ప్రధాన కార్యదర్శి "తోట దొరబాబు", మహిళ అధ్యక్షురాలు "బోనంగి సత్యవతి"



RTVNEWS (లవకుశ)డోలుమోతలు లేని మన్యం రహదారులు కావాలన్నదే కూటమి ప్రభుత్వం ధ్యేయమని తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తోటా దొరబాబు మండల మహిళా అధ్యక్షురాలు బోనంగి సత్యవతి అన్నారు. ఆదివారం తెలుగువారి నూతన సంవత్సరం రోజు అయిన ఉగాది పర్వదినం నాడు మండలంలో చిట్టెంపాడు పంచాయతీ లింగాపురం గ్రామానికి, అదే పంచాయతీలో గోపవరం నుండి లింగాపురానికి రోడ్డు పనులకు పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రత్యేక చొరవతో మూడు కోట్ల 50 లక్షలు నిధులు మంజూరు చేయించడంతో ఆ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తోట దొరబాబు సత్యవతి మాట్లాడుతూ పాడేరు నియోజకవర్గం ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆదేశాల మేరకు ఈ రోడ్డు పనులు కు శంకుస్థాపన చేయడం జరిగింది అన్నారు అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గిరిజన  మారుమూల ప్రాంతాలకు సైతం డోలుమోతలు ఉండకూడదనే ఉద్దేశంతోనే రహదారులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రానున్న కాలంలో మండలంలో మారుమూల గ్రామాల అన్నింటికీ రహదారులు నిర్మించడం జరుగుతుందని వారుఈసందర్భంగా తెలియజేశారు. ఏళ్ల తరబడి మారుమూల గ్రామమైన లింగాపురానికి రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్న తమకు తారురోడ్డు మంజూరు చేయించిన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి ప్రత్యేక కృతజ్ఞతలు గ్రామస్తులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాడి దారబాబు బూత్ ఇంచార్జ్ వార కొండలరావు తోకల దేవి రీమల జగన్ పాడి వెంకటేష్ కీర్తి తోపాటు కూటమి నాయకులు ఆయా గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
  • Newer

    డోలు మోతలు లేని రహదారులు కావాలన్నదే కూటమి ప్రభుత్వం ధ్యేయం. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి ప్రత్యేక కృతజ్ఞతలు. మండల పార్టీ ప్రధాన కార్యదర్శి "తోట దొరబాబు"

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">