మన్యంలో విరబూసిన విద్యా కుసుమం. ఎంబిబిఎస్ పట్టా పొందిన నడింపాలెం గ్రామానికి చెందిన "సుమ్మర్ల మహేశ్వరి మానస"

Rtv Rahul
0
మన్యంలో విరబూసిన విద్యా కుసుమం

పేద ప్రజానీకానికి సేవ చేయడమే తన ధ్యేయం

రంగరాయ యూనివర్సిటీలో ఎంబిబిఎస్ పట్టా పొందిన మహేశ్వరి మానస

RTVNEWS (లవకుశ)అల్లూరి జిల్లా మన్య ప్రాంతంలో  విద్య కుసుమం విరబూసింది. కొయ్యూరు మండలం నడింపాలెం గ్రామానికి చెందిన గిరిజన బిడ్డ సుమ్మర్ల మహేశ్వరి మానస (23) ఆదివారం కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ పట్టా పొందారు. మహేశ్వరి మానస తండ్రి  సుమ్మర్ల రాము వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ చిన్నతనంలోనే మృత్యువాత పడ్డారు. దీంతో తల్లి మాజీ ట్రైకార్ డైరెక్టర్ సువర్ణ సరస్వతి వైద్య రంగంలో ఉన్నత శిఖరానికి చేర్చింది. ఈ సందర్భంగా మహేశ్వరి మానస మాట్లాడుతూ గిరిజన ప్రాంతానికి చెందిన తాను ఈ స్థాయికి చేరుకునేందుకు తన తల్లి ఎంతగానో శ్రమించిందని, కావున తాను పుట్టి పెరిగిన ప్రాంతానికి,పేద ప్రజానీకానికి సేవ చేయడమే తన ముందున్న జీవిత ఆశయమని ఆమె తెలిపారు. అదేవిధంగా తనలా ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద విద్యార్థులు గూర్చి  శ్రద్ధ వహిస్తానని అమె  తెలిపారు. తమ ప్రాంతానికి చెందిన గిరిజన బిడ్డ వైద్యరంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడం పట్ల ఈ ప్రాంత ప్రజలు అభినందనలు తెలియజేసి మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">