రెళ్లి సామాజిక వర్గానికి ఎస్సీ వర్గీకరణలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి.. అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు "ఎర్రంశెట్టి అప్పన్న బాబు"

Rtv Rahul
0
రెళ్లి సామాజిక వర్గానికి ఎస్సీ వర్గీకరణలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించే వరకు ఉద్యమాలు

రెళ్లి సంఘం జిల్లా అధ్యక్షుడు ఎర్రం శెట్టి అప్పన బాబు


RTVNEWS( లవకుశ)రెళ్లి సామాజిక వర్గానికి ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లో ఐదు శాతం కల్పించే వరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే నిరసన కార్యక్రమాలు మరింత ఉదృతంగా  చేయాలని అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ఎర్రంశెట్టి అప్పన్న బాబు పిలుపునిచ్చారు. ఆదివారం గొలుగొండ మండలం కృష్ణ దేవి పేటలో విలేకరులతో మాట్లాడుతూ శనివారం నర్సీపట్నంలో జరిగిన రెల్లి గర్జన కార్యక్రమాంలో పాల్గొన్న రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులకు, యువతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం నాయకత్వాన్ని పట్టించుకోకుండా కొంతమంది పేర్లే తెలిసేటట్లుగా ప్రకటించుకోవడం సోషనీయమని అన్నారు. రెల్లి కులస్తులు ఐక్యతగా ఐదు శాతం రిజర్వేషన్ సాధించేవరకు ఎవరెన్ని కుట్రలు చేసిన ఐక్యంగా పోరాడాలని పేరు ప్రఖ్యాతల కోసం పాకులాడవద్దని హితువు పలికారు. ఎస్సీ వర్గీకరణలో మాదిగ, మాల కులస్తులకు ఏ విధమైన రిజర్వేషన్ కల్పించారో అదేవిధంగా రెళ్లి కులస్తులను గుర్తించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు లను కోరుతున్నామని అన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం మా సమస్యపై అసెంబ్లీలో స్పందించడం హర్షనీయమని అన్నారు. రెళ్లి కులస్తులు ఎమ్మెల్యేలు ఎంపీలు లేనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వము ఐదు శాతం రిజర్వేషన్ కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐదు శాతం రిజర్వేషన్ కోసం రాష్ట్ర, జాతీయ స్థాయిలో రెల్లీలు అందరూ మరింత ఐక్యతగా పోరాడాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బంగారు శ్రీను, ఎల్లపు లోవరాజు, ముత్యాల చిన్నబ్బాయి, ఎర్రం శెట్టి కుమార్, శివ, ఎర్రంశెట్టి దుర్గాప్రసాద్, మజ్జి రత్నం రాజు, కోన ప్రసాద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">