విశాఖఅంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లో వైయస్సార్ పేరు తొలగించడంపై చేపట్టిన నిరసన లో పాల్గొన్న అరకు పార్లమెంటు మాజీ సభ్యురాలు" గొట్టేటి మాధవి"

Rtv Rahul
0
క్రికెట్ స్టేడియంలో వైయస్సార్ పేరు తొలగించడం అన్యాయం 

అరకు మాజీ ఎంపీ "గొడ్డేటి మాధవి"



RTVNEWS (లవకుశ)విశాఖపట్నం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరును తొలగించడం సమంజసం కాదని అరకు పార్లమెంటు మాజీ సభ్యురాలు గొట్టేటి మాధవి పేర్కొన్నారు. గురువారం వైయస్సార్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు , ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో గొడ్డేటి మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహానికి సహసర ప్రజాప్రతినిధులతో కలసి పాలాభిషేకం నిర్వహించారు. ముందుగా అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ పేద ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన మహానీయులు డాక్టర్ వైయస్ఆర్ అని ఆయన పేరును తొలగించడం సమంజసం కాదని ఆమె అన్నారు. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆయన పేరు చిరస్థాయిగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారాముల జిల్లా అరకు ఎమ్మెల్యే రేగం  మత్యలింగం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి , శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి, రాష్ట్ర మాజీ జిసిసి చైర్మన్ శోభ స్వాతిరాణి, అరకు వ్యాలీ మండలం జడ్పిటిసి శెట్టి రోషిని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">