లింగంపేట నూకాలమ్మ తల్లి గరగలు ఊరేగింపు
ఆలయ కమిటీ చైర్మన్" కొడమంచిలి వరలక్ష్మి"
RTVNEWS (లవకుశ)ఈనెల 28నుండి జరిగే గ్రామ దేవత లింగంపేట నూకాలమ్మ ఉత్సవాల ప్రారంభోత్సవ సందర్భంగా బుధవారం లింగంపేట గ్రామంలో ఆలయ కమిటీ చైర్మన్ కొడమంచిలి వరలక్ష్మి ఆధ్వర్యంలో నూకాలమ్మ తల్లి గరగలు తీసి ఊరేగింపు నిర్వహించారు. గ్రామఆచారం ప్రకారం ఉత్సవాలకు పది రోజులు ముందుగా గరగలకు గ్రామస్తులంతా పూజలు నిర్వహించి ముందుగా గొలుగొండ పంపిస్తారు. అనంతరం గొలుగొండ గ్రామంలో గరగలు ఊరేగింపు జరిగిన తర్వాత మండలానికి చుట్టుప్రక్కల ఉన్న కొయ్యూరు చింతపల్లి నర్సీపట్నం గూడెం కొత్త వీధి తదితర మండలాలకు ఉత్సవాల ప్రచారం నిమిత్తం గరగల ఊరేగింపు జరుగుతుంది. ఈ సందర్భంగా లింగంపేట గ్రామంలో ఉదయాన్నే ప్రజలంతా గరగలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి సాగనంపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు మరిసా వెంకటరమణ, మాజీ సర్పంచ్ పరవాడ అప్పలనాయుడు, గింజర్తి మాజీ సర్పంచ్ గెడ్డం సత్యనారాయణ, ఉత్సవ కమిటీ చైర్మన్ లంక సత్యనారాయణ, అనకాపల్లి పార్లమెంటరీ టిఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు గోలకొండ శ్రీకాంత్, జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సలాదుల ప్రసాద్, నూకాలమ్మ దేవస్థానం డైరెక్టర్లు ఎర్రా నాగేశ్వరరావు, కొప్పోజు లక్ష్మి, మిడతన రత్నం, ఆలయ అర్చకులు గోలకొండ త్రిమూర్తుల, గోలకొండ కుటుంబీకులు లతో పాటుగా పలువురు టిడిపి జనసేన నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.