సవాల్ కు శవాలై ఆకాశ రామన్న ఉత్తరాలు
చౌకబారు ప్రకటనలు చేసేవారు తమ కుటుంబం చరిత్ర తెలుసుకోవాలి
ఆదివాసి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు "మొట్టడం రాజబాబు"
RTVNEWS( లవకుశ)సవాల్ కు శవాలై ఆకాశ రామన్న ఉత్తరాలు రాయిస్తున్న కమ్యూనిస్టుల పని మైదానంలో అయిపోయిందని,మన్యంలో చివరి దశకు చేరుకున్నదని భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు కమ్యూనిస్టులను ఉద్దేశించి వ్యంగ్యంగా వాఖ్యానించారు.రాజబాబును ఉద్దేశించి సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ ను ఉద్దేశించి ఆయన స్పందిస్తూ కమ్యూనిస్టుపార్టీ 1964లో ఒకసారి,1967లో రెండోసారి ఆ తర్వాత మరెన్నోసార్లు ముక్కలు ముక్కలుగా విడిపోయింది నిజంకాదా అంటే నా మీద కనీస అవగాహనలేని వారితో వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు చేసారు.నేనొక ఇంజనీర్ నని, అవినీతి చేసి సంపాదించుకోవడానికైతే ఆదివాసీ ఉద్యమ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని,ఉద్యోగమే చేసుకొందునని లేదంటే లెఫ్ట్, రైట్,భూర్జవ వంటి ఆదివాసేతర పార్టీలలో పని చేసేవాడినని,దమ్ముంటే పాడేరు గిరిజన భవన్ వేదికగా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేస్తే,సవాల్ ని స్వీకరించలేక ఒక గొత్తి మనిషితో ఆకాశ రామన్న ఉత్తరాలు సోషల్ మీడియాలో వ్రాయించారు.ఆ గొత్తి మనిషి ఎవరో అందరికీ తెలుసునని,ఆ మనిషికి ఇది కొత్తమే కాదని,గతంలో ఐటీడీఏ పీఓ,డిడి,వార్డెన్ ల మీద పాంప్లెట్స్ వేసి డబ్బులు డిమాండ్ చేసేవాడని,ఆ తర్వాత గంజాయి స్మగ్లర్ గా మారాడని అలాంటి వ్యక్తితో నా మీద సోషల్ మీడియాలో ఎర్ర ఎర్రి రాతలు వ్రాయించారని,నన్ను వ్యక్తిగతంగా విమర్శించినప్పుడే వారికి నాయకుల లక్షణాలు లేవని తేలిపోయిందని,నేను విధాన పరమైన విషయాలను ప్రస్తావిస్తే,వారు వ్యక్తిగత విమర్శలు చేసారు.అరకు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన కొత్తపల్లి గీత ఒక్కరే బోగస్ గిరిజనరాలు కాదు,అరకు ఎంపీ ఎన్నికల్లో నలుగురు బోగస్ గిరిజనులు పోటీలో ఉండేరని,కమ్యూనిస్ట్ పార్టీయే బోగస్ గిరిజనులను పెంచి పోషిస్తున్నదని,కాలమే సమాధానం చెబుతుందని,ఎవరో నాకు రాజకీయ భిక్ష పెట్ట వలసినవసరం లేదని, మా ముత్తాత మొట్టడం సోబిలన్ దొర 1912 నుండే గూడెం ముఠదారు అని,తర్వాత ఆయన కుమారుడు మొట్టడం వీయ్యదొర కూడా గూడెం ముఠదారు అని,బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1916-17 లో లాగరాయి పితూరులో కీలకపాత్ర పోషించారు.మన్యం పితూరి (అల్లూరి సీతారామరాజు పితూరి)లో మా ముత్తాతలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు.1937లో మద్రాసు ప్రెసిడెన్షియల్ కు జరిగిన తొలి ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం నుండి మా అమ్మ తాతయ్య పనసల పెద్దుపడాల్ శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు.మా చిన్నాన్న మొట్టడం వీరవెంకట సత్యనారాయణ చింతపల్లి నియోజకవర్గానికి రెండు సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు.మా చిన్న తాతయ్య పనసల బోడయ్యపడాల్ కొయ్యూరు సమితి అధ్యక్షులుగా,మా నాన్నమ్మ మొట్టడం చిన్నయమ్మ కొయ్యూరు సమితి ఉపాధ్యక్షురాలుగా పనిచేశారు.స్థానికసంస్థల ఎన్నికల్లో ప్రతిసారి మా కుటుంబ సభ్యులు సర్పంచ్ గానో,ఎంపీటీసీగానో ఎన్నికవుతూనే ఉన్నారు.చాలా గ్రామాలలో గ్రామ మునసబులుగా ఉన్నారు.మొన్న జరిగిన పీసా కమిటీ ఎన్నికల్లో కూడా మా కుటుంబానికి చెందిన వారు ఉన్నారని,రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుండి వచ్చిన నేనేంటో సమకాలీన రాజకీయ నాయకులకు తెలుసు.నేనొక విద్యావంతుడునని,మాతృభాష తెలుగుతో పాటు ఇంగ్లీష్,హిందీ భాషలు మాట్లాడగలనని భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ్ని చేసి,ఎంపీ గా పోటి చేయించింది.పార్టీ బలోపేతం కొరకు పోటిలో ఉన్నాం. అదిగో అదిగదిగో సమసమాజం,నవ సమాజం,సోషలిజం అని చెప్తుంటే భూతద్దం పెట్టి చూసిన కనిపించకపోవడంతో వారిని ప్రజలు నమ్మడం లేదు, ఇక వారు వ్రాయించిన ఎర్రెర్రని ఎర్రి వ్రాతలను ఎవరు నమ్ముతారు. పాడేరు గిరిజన భవన్ వేదికగా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరితే శవాలైన వారిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు.విద్యార్ధి సంఘం,యువజన సంఘం,కార్మికసంఘం,కర్షక సంఘం,కులం సంఘం అంటూ రకరకాల సంఘాల పేరుతో చందాలు వసూలు చేస్తారని,ప్రజలందరూ ముఖ్యంగా ఆదివాసీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని,వారికి చందాలు, విరాళాలు ఇవ్వవలసిన అవసరం లేదని,ప్రపంచానకిి పోరాటం నేర్పింది ఆదివాసీలని,ఆదివాసీల సమస్యల మీద ఆదివాసీలే పోరాటం చేస్తారని,ఆదివాసీలకు సొంతంగా సంఘాలు,పార్టీలు కూడా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.