జనసేన పార్టీ 12 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వృద్ధులకు ఆహారం పంపిణీ
జనసేన మండల పార్టీ అధ్యక్షుడు గండెం దొరబాబు, బీసీ సెల్ అధ్యక్షుడు దుంగల రమేష్
RTVNEWS(లవకుశ)జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గొలుగొండ మండలం మేజర్ పంచాయతీ ఏ ఎల్ పురం గ్రామంలో ఫుడ్ ఫర్ పూర్ పీపుల్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఆహారాన్ని శుక్రవారం అందించారు .ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గండెం దొరబాబు , బీసీ సెల్ అధ్యక్షుడు దొంగల రమేష్ మాట్లాడుతూ ఫుడ్ ఫర్ పీపుల్స్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు, వృద్ధులకు వికలాంగులకు అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ ట్రస్ట్ కు ప్రతి ఒక్కరు సహకారం అందించి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షులు దుంగల రమేష్ గ్రామ పార్టీ అధ్యక్షుడు రుత్తల అశోక్ కుమార్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆవిర్భావ సభకు తరలి వెళ్ళిన జనసైనికులు..
.---------------------
జనసేన నర్సీపట్నం ఇంచార్జ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన వీర సూర్యచంద్ర ఆధ్వర్యంలో పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ 12 ఆవిర్భావ సభకు మండలం నుండి అధిక సంఖ్యలో జనసైనికులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన మొదటిసారిగా జరిగే ఆవిర్భావ సభకు ఊహించని రీతిలో నర్సీపట్నం నియోజవర్గం నుండి జనసైనికులు వీర మహిళలు తరలి వెళ్లారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గొలుగొండ మండల పార్టీ అధ్యక్షులు గండెం దొరబాబు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సలాదుల ప్రసాదు బీసీ సెల్ మండల అధ్యక్షుడుదుంగల రమేష్ ఉపాధ్యక్షుడు చక్రవర్తి అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు