మర్రిపాలెం మహిళా డిగ్రీ కాలేజిలో భోదన నిర్వహణ పనితీరు భేష్.
' ఏ గ్రేడ్ ' ప్రకటించిన జిల్లా అడిట్ అధికార్లు .
ప్రిన్సిపాల్" సుధ" కు అభినందలు తెలిపిన అడిట్ అధికార్లు.
RTVNEWS( లవకుశ)విద్యార్థులకు విద్యా బోధనతో పాటు కళాశాలలో అన్నీ విభాగాల పనితీరు నిర్వహణలో కాలేజి ప్రిన్సిపాల్, సిబ్బంది సేవలు అభినందనీయమని శభాష్ అంటూ కితాబు పలికారు జిల్లా వార్షిక అడిట్ అధికార్లు. కొయ్యూరు మండలం మర్రిపాలెం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం "ఏకడమిక్ అడిట్ నిర్వహించారు. ఈ అడిట్ లో కళాశాల పనితీరు, విద్యాబోధన, రికార్డుల పరిశీలన చేపట్టిన అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ కె. సుధ ఆధ్వర్యంలో కళాశాల ఉపన్యాశకులు జరిపిన బోధన పరిశీలించిన తీరు, కళాశాల పురోభివృద్ధికి తోడ్పడుతున్నారంటూ ప్రశంసిస్తూ ఏకడమిక్అడిట్ బృందం అధికార్లు బి . శంకరరావు, ఎస్.మల్లిబాబు శభాష్ అంటూ కితాబు పలికి అభినందనలు తెలిపారు .అనంతరం మహిళా కళాశాలకు జిల్లా లో ' ఏ గ్రేడ్ ' కళాశాలగా గుర్తింపు కల్పించారు. దీనిపై ప్రిన్సిపాల్ వారికి కళాశాలను తగిన గ్రేడ్ కల్పించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ కు కళాశాల పట్ల మరింత భాధ్యత పెరిగిందన్నారు..ఈ కార్యక్రమంలో పలువురు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.