ఏజెన్సీలో గిరిజనేతురుల పక్కా గృహాలపై ఎమ్మెల్యే శిరీష దేవి అసెంబ్లీలో ప్రస్తావించడం తగదు.. ఏపీ గిరిజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి" కూడారాధాకృష్ణ"

Rtv Rahul
0
ఏజెన్సీలో గిరిజనేతరులు గృహాలుపై  ఎమ్మెల్యే శిరీష దేవి అసెంబ్లీలో ప్రస్తావించడం తగదు


 1/70 చట్టం సవరణకు కుట్రలో భాగమే- 

ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి" కూడ రాధాకృష్ణ."




  RTVNEWS( లవకుశ)శాసనసభలో రంపచోడవరం ఎమెల్యే మిరి యాల శిరీషాదేవి గిరిజనేతరులకు వక్కా గృహాలు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం  మంజూరు చేయాలని చట్టసభలో మాట్లా డడం ఆదివాసులకు ఆదివాసీ హక్కులు, చట్టాలకు ద్రోహం చేయడమేనని, ఆదివాసుల హక్కులు, చట్టాలు జొలికిస్తే సహిం చేది లేదని  ఏపీ గిరిజన సమాఖ్య హెచ్చరించింది. ఈ సందర్భంగా బుధవారం ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి  కూడ రాధాకృష్ణ  మాట్లాడుతూ 1952 ముందు నుండి రంపచోడవరం ఏజెన్సీలో నివసిస్తున్న గిరిజనేతరులకు పక్కా గృహాలు నిర్మించుకోవడం కోసం ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని రంవచోడవరం ఎమెల్యే మిరియాల శిరీష దేవి మాట్లాడడం 1/70 చట్టంను ఉల్లంఘించడమే అవు తుందన్నారు. 1/70 చట్టంపై ఇటీవల శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా ఆదివాసులు తిరగ బడ్డారని, దీనికి ప్రభుత్వం దిగి వచ్చిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి 1/70 చట్టం రక్షణకై కట్టుబడి ఉన్నామని ప్రకటించడం నిజమేనా లేక ఆదివాసులను నమ్మించి మోసం చేయడమా అనీవారు ప్రశ్నించారు. ఆదివాసీ ప్రజాప్రతినిధి అయివుండి ఆదివాసీ హక్కులు, చట్టాలు నిర్వీర్యం చేసేవిధంగా మాట్లాడడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1/70 చట్టం సవరణకు కుట్రలో భాగమేనని అనుమానించాల్సి వస్తుందని. ఎమెల్యే శిరీషాదేవి మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివాసులు రాష్ట్రంలో అనేక సమస్యలతో సతమతమవుతున్నారని జీఓ నెంబర్-3 చట్టబద్ధత కల్పించాలని ఆదివాసీ స్పెషల్ డీఎస్పీ నోటిపికేషన్ విడుదల చేయాలని ఆదివాసీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఆదివాసుల సమస్యలపై మాట్లాడకుండా ఏజెన్సీ షెడ్యూల్ ఏరియాలో అక్రమంగా నివసిస్తున్న గిరిజనేతరులకు పక్కా భవనాలు నిర్మించాలని ప్రభుత్వానికి కోరడం 1/70 చట్టం, పెసాచట్టాన్ని ఉల్లంఘించడమేనని తక్షణమే రంప చోడవరం ఎమెల్యే మిరియాల శిరీషాదేవి ఆదివాసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు, రాజు, చంటి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
  • Newer

    ఏజెన్సీలో గిరిజనేతురుల పక్కా గృహాలపై ఎమ్మెల్యే శిరీష దేవి అసెంబ్లీలో ప్రస్తావించడం తగదు.. ఏపీ గిరిజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి" కూడారాధాకృష్ణ"

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">