పదో తరగతి పరీక్షలు రాసి విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ
శ్రీ నూకమాంబిక ఆటో యూనియన్ వైస్ ప్రెసిడెంట్" సురేష్ పట్నాయక్"
RTVNEWS (లవకుశ)శ్రీ శ్రీ నూకమాంబిక ఆటో యూనియన్ యజమానులు ,డ్రైవర్ల పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు శ్రీ నూకమాంబిక ఆటో యూనియన్ ఉపాధ్యక్షుడు సురేష్ పట్నాయక్ ఆర్థిక సహకారంతో స్టేషనరీ అందజేయడం జరిగిందని తెలిపారు. కొయ్యూరు మండలం డౌనురు గ్రామానికి చెందిన సురేష్ పట్నాయక్ నర్సీపట్నం శ్రీ నూకమాంబిక ఆటో యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అయితే పదో తరగతి విద్యార్థులకు ఏదో ఒక రూపంలో తన సహకారం అందించాలని దృక్పథంతో తమ యూనియన్ యజమానులు, డ్రైవర్లు పిల్లలకు ఈ తన ఆర్థిక సహకారంతో స్టేషనరీని సోమవారం అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం 10వ తరగతి చదివే విద్యార్థులకు స్టేషనరీని తమ యూనియన్ సభ్యుల పిల్లలకు.డౌనురు, గదభ పాలెం చిట్టెంపాడు, మూలపేట పంచాయతీల్లో ఉన్న విద్యార్థులు కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నూక మాంబిక ఆటో యూనియన్ అధ్యక్షుడు అంకంరెడ్డి శ్రీను కోశాధికారి నాయుడు కార్యదర్శి నూకరాజు గౌరవ అధ్యక్షులు సత్తిబాబు మెంబర్లు సుబ్బారావు అప్పారావు రాజేష్ డ్రైవర్లు యజమానులు తదితరులు పాల్గొన్నారు