బాలల హక్కుల పరిరక్షణ సమితి కన్వీనర్ గా "రీముల గంగాధర్"
రాష్ట్ర కన్వీనర్ శుభ (చిన్ని) కి ధన్యవాదాలు
RTVNEWS (లవకుశ)బాలల పరిరక్షణ ఆరోగ్యం జీవన విధానం, హక్కుల పట్ల కృతనిత్యంతో తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అల్లూరి జిల్లా బాలల పరిరక్షణ కమిటీ నూతన కన్వీనర్ రీముల గంగాధర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ బాలల హక్కులు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో నూతన జిల్లాల కమిటీ కార్యవర్గాలను ఎంపిక చేశారని గంగాధర్ తెలిపారు. దీంతో అల్లూరి జిల్లా బాలల హక్కుల పరిరక్షణ కమిటీ కన్వీనర్ గా తనను రాష్ట్ర కన్వీనర్ కాంగు శుభ (చిన్ని) ఆశీస్సులతో ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సూచనల మేరకు జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పర్యటన లు చేస్తూ బాలల హక్కులు, పరిరక్షణ, సమస్యలు, జీవన విధానం, ఆరోగ్యం పట్ల నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.