పాల ప్రగతి కేంద్రాలు పేరుతో కసింకోట ఎస్ బి ఐ లో40 లక్షలు టోకరా!
వెలుగులో అధికారులు చీకటి ఒప్పందాలు
ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు "జక్కు నరసింహ మూర్తి"
RTV NEWS (లవకుశ) అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో పాల ప్రగతి పేరుతో "వెలుగు "లో జరిగిన 40 లక్షల అక్రమాలపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయాలని ప్రజా సంకల్ప వేదిక (ఆర్టిఐ) రాష్ట్ర అధ్యక్షులు జక్కు నరసింహమూర్తి డిమాండ్ చేశారు. దీనిపై అనకాపల్లి అనకాపల్లి ప్రాజెక్టు డైరెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా కసింకోట మండలం ఎంపిక చేసి వెలుగు మండలంలో 8 గ్రామ సంఘాలను ఎంపిక చేసి ఒక్కొక్క సంఘానికి ఐదు లక్షల చొప్పున 40 లక్షల మంజూరు చేసి కసింకోట ఎస్బిఐ ద్వారా 2016లో అందించారు. ఒక్కొక్క గ్రూపుకు సబ్సిడీ కింద 1,75,000 రూపాయలు మంజూరు చేశారు. అప్పటిలో పనిచేసిన వెలుగు సిబ్బంది బ్యాంకు సిబ్బందితో కలిసి రుణాలు పక్కదారి పట్టించారు. ఈ విషయం ఆర్టిఐ ద్వారా వెలుగు చూసింది. రుణాలు అందించి 10 ఏళ్ళు గడుస్తున్న సభ్యుల నుండి రికవరీ జాడ కాన రాలేదు. ఎస్బిఐ అధికారులు నోటీసులు జారీ చేస్తే మేము రుణాలు తీసుకోలేదని సమాచారం ఇచ్చినట్లుగా తెలిసింది. వెలుగులో ఇదంతా చీకటి ఒప్పందాలు చేసుకొని ఈ ప్రాజెక్టు నడిపారని అనుమానం తలెత్తుతుంది. సామాన్య ప్రజలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు అనేక కొర్రీలు చేస్తారని అటువంటిది 40 లక్షలు రుణాలు ఇచ్చి ఏ విధంగా వదిలేసారు బ్యాంకు అధికారులు సమాధానం చెప్పాలని నరసింహమూర్తి ప్రశ్నించారు. వీటన్నిటిపై విచారణ జరిపిస్తే మరిన్ని వెలుగులోకి వస్తాయన్నారు. తక్షణమే అనకాపల్లి ప్రాజెక్టు డైరెక్టర్ విచారణకు ఆదేశించి క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర అధ్యక్షులు జక్కు నరసింహమూర్తి డిమాండ్ చేశారు.