1/70 చట్టంపై అసెంబ్లీలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయలి
ఈనెల 6, 7 తేదీలలో రిలే నిరాహార దీక్షలు విజయవంతం చేయండి
అఖిలపక్ష రాజకీయ, ప్రజాసంఘాల ఐక్యవేదిక పిలుపు

RTVNEWS (లవకుశ)1/70 చట్టం పై అసెంబ్లీ స్పీకర్ ఆయన పాత్రుడు వాక్యాల నిరసిస్తూ 48 గంటల బంద్ సందర్భంగా సీఎం నారా చంద్రబాబునాయుడు 1/70 చట్టంపై గౌరవిస్తున్నం, రద్దు చేసే ఆలోచన లేద అని ఎక్స్ వేదికగా ప్రకటించడం హర్షిస్తున్నాం కానీ. ఆదివాసి ప్రాంతం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతో ఆదివాసి ప్రాంతం అడవులంతా అధాని, అంబానీలకు కట్టబెట్టి ఆదివాసులను నిర్వాసితులుచేసే కుట్రలో పాల్గొంటుందని. 1/70 చట్టంపై అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టమైన ప్రకటన చేయాలి, ఆదివాసులకు క్షమాపణ చెప్పాలి అఖిలపక్షం ప్రజా సంఘాల డిమాండ్ చేస్తుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మానపడాలు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలదేవ్, గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ, బూడిద చిట్టిబాబు, సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ: అసెంబ్లీ సమావేశాలలో జీవో నెంబర్ 3 కనీసం ప్రస్తావన లేకపోవడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ 3 కు చట్టబద్ధత కల్పిస్తూ ఆదివాసి ప్రాంతంలో ఆదివాసులకు ఉద్యోగాలు ఉండేలా తమ ప్రభుత్వం వస్తే కట్టుబడి ఉంటామని అరకు సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన పరిస్థితి ఉంది. 100శాతంఉద్యోగ ఉపాధ్యాయ రిజర్వేషన్ చట్టా ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని, బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు 17 వేల కోట్లు కేటాయించి,గిరిజన సలహా మండలి టిఎసి నీ వెంటనే నియమించాలన్నారు. ఆదివాసి ప్రాంతంలో ఊడల మర్రి లా విస్తరిస్తున్న బినామీ, వ్యవస్థను మరియు వలస నిరోధక చర్యలు కోసం అసెంబ్లీలో చట్టం చేయాలని అఖిలపక్ష రాజకీయ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సుదీర్ఘంగా చర్చించి ఈనెల 6, 7 తేదీలలో నిరాహార దీక్షలు పాడేరు ఐటీడీఏ ముందు చేయటానికి అఖిలపక్ష రాజకీయ ప్రజా సంఘాల ఐక్యవేదిక పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ మల్లమ్మ ఆదివాసి సంఘం, కే అరుణ, శ్రీలత, రాజశేఖర్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, చిన్నారావు ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు, రాజు ఆదివాసి సేన, భాను సిహెచ్ రావు కాంగ్రెస్, చంటిబాబు సిపిఐ మండల కార్యదర్శి, లక్ష్మణరావు ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు, సీత, చిన్నమ్మి, అశోక్ కుమార్, బుల్లెమ్మ,, శైలు, భీముడు డిఎల్ఓ జిల్లా ప్రధాన కార్యదర్శి, కృష్ణ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు, సోంబాబు తదితరులు పాల్గొన్నారు
