బాలారం జడ్పీ హైస్కూల్ భౌతిక శాస్త్రం ఉపాధ్యాయులు "తుచ్చా దేముడు"మృతి

Rtv Rahul
0
బాలారం జడ్పీ హైస్కూల్ భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడు మృతి 

పలువురు ఉపాధ్యాయులు సంతాపం 



RTVNEWS (లవకుశ)కొయ్యూరు మండలంలో బాలారం జిల్లా పరిషత్ హైస్కూల్లో భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న తుచ్చాదేముడు హృదయ సంబంధ వ్యాధితో బాధపడుతూ బుధవారం ఉదయం నర్సీపట్నంలో తీవ్ర అస్వస్థత గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉపాధ్యాయుడు తుచ్చా దేవుడు గత కొన్ని సంవత్సరాలుగా హృదయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారని ఇప్పటికే ఆయనకు మూడుసార్లు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందని తెలిపారు. బుధవారం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆపరేషన్ అవసరం ఏర్పడగా కుటుంబ సభ్యులు ఆ ప్రయత్నాలు చేస్తుండగా మరణించారని తెలిపారు ఈయనకు భార్య మాధురి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య నర్సీపట్నం బాలికల హైస్కూల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుడు తుచ్చా దేవుడు మృతి పై మండల విద్యాశాఖ అధికారులు రాంబాబు , నాగభూషణం పలువురు ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">