ప్రభుత్వం మారిన తొలగించని ప్లేక్సీలు.
కంటారం పి హెచ్ సి లో సిబ్బంది నిర్లక్యం.
RTVNEWS (లవకుశ)రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో కి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నప్పటికి ఇక్కడ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాజీ సి ఎం జగన్మోహన్రెడ్డి తో ఉన్న ప్లాక్సైలే దర్శనం ఇస్తూన్నాయి. కొయ్యూరు మండలం కంఠరం పి హెచ్ సి లో మాజీ ముఖ్యమంత్రి చిత్ర పటం తో ఉన్న ప్లేక్స్ తిలగించాలంటూ జిల్లా కలెక్టర్ సైతం అదేశాలు జారీ చేసినా ఇక్కడ నేటికీ తొలగించక పోవటం పట్ల మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలిసిన కేవలం హాస్పటల్ లో సిబ్బంది నిర్లక్ష్యమే నని ఆయన మండి పడ్డారు. ఇదే పరిస్థితి లో అంతాడ సచివాలయం కార్యాలయ భవనంలో నేటికీ గత ప్రభుత్వ హయంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి స్టికర్ ను నేటికీ తొలగించకపోవటం పట్ల టీడీపీ నాయకులు ఇక్కడ సిబ్బంది పై మండి పడుతున్నారు.తక్షణమే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆయా చోట్ల లో ప్లేక్సీలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.