పోస్ట్ మేన్ గవరాజు రేపు పదవి విరమణ
RTVNEWS( లవకుశ)గొలుగొండ మండలం మేజర్ పంచాయతీ ఏ ఎల్ పురం గ్రామంలో 45 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోస్ట్ మెన్ గొంప గవరాజు గురువారం పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం తంతి తపాలా కార్యాలయంలో పదవి విరమణ వీడ్కోలు సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు పోస్టల్ ఉద్యోగులు యూనియన్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని గవరాజుకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయమన్నారు. అయితే గ్రామంలో గవరాజు చేసిన సేవలతో ఎందరో ఉద్యోగులు, గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. ఇటువంటి ఉత్తమ సేవలు అందించిన గవరాజు పదవి విరమణ చేయడం బాధాకరమని అన్నారు. ఇటువంటి వ్యక్తి సుదీర్ఘకాలం సేవలు అందిస్తూ ప్రజలు మన్నన లు పొందుతూ ఉత్తమ సేవలు అందిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి గవరాజు అని గ్రామస్తులు కొనియాడారు.