పెద్దల సభను రాజకీయం చేయడం సమంజసం కాదు!
ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు "మొట్టడం రాజబాబు"
RTVNEWS (లవకుశ)పెద్దలసభను(శాసన మండలిని)రాజకీయం చేయడం సమంజసం కాదని భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు అన్నారు. శుక్రవారం విలేకరులకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పెద్దలసభ (శాసన మండలి) ఉండాలన్నారు. శాసన మండలి సభ్యులైన ఎమ్మెల్సీ ఎన్నిక గవర్నర్ కోటా,పట్టభద్రుల కోటా,ఉపాధ్యాయుల కోటా,స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోటా,ఎమ్మెల్యేల కోటా ఇలా వివిధ రూపాలలో ఎమ్మెల్సీలు ఉంటారని. సాధారణంగా ఎమ్మెల్యే కోటా, స్ధానికసంస్థల ప్రజా ప్రతినిధుల కోటాలలో ఎమ్మెల్సీ ఎన్నిక రాజకీయ పార్టీల ప్రమేయం ఉంటుంది,కానీ విచిత్రంగా ఈ దపా జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తిగా రాజకీయమే నడిచిందని పేర్కొన్నారు.బహిరంగానే రాజకీయ పార్టీలు మద్దతుతో ఎన్నికలు జరిగాయిని,అలాంటప్పుడు ఉపాధ్యాయ,పట్టభద్రులని పేరెందుకని,విచిత్రమేమిటంటే ఎమ్మెల్సీ అంటే ఏంటో తెలియని కొందరు రాజకీయ నాయకులు,కార్యకర్తలు,చోటా మోటా నాయకులు ఉన్నత పాఠశాలల్లోకి చొరబడి ఉన్నత విద్యావంతులైన మేధావులకు ప్రచారం చేయడం,అదే చోటామోటా నాయకులతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు వేదికలను పంచుకోవడం కాస్తా జుగుప్సకరంగా కనిపించిందని తెలిపారు దీనిపై.మేధావి వర్గం కూడా ఆలోచించావలసిన విషయమిదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.