జోరుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారం
పాకలపాటిరఘువర్మను ఎమ్మెల్సీగా గెలిపించండి
ఏపీటిడిసి డైరెక్టర్ కిల్లు వెంకట రమేష్ నాయుడు
RTVNEWS (లవకుశ)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఏపీ టూరిజం డైరెక్టర్ కిల్లు వెంకట రమేష్ నాయుడు మంగళవారం పాడేరు మండలంలో శ్రీ మోదమాంబ హై స్కూల్, బివివికె, కందమామిడి, రాయిగడ్డ, డోకులూరు,గుత్తులపుట్టు తదితర పాఠశాలల్లో పర్యటించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పాకలపాటి రఘువర్మ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రఘువర్మ కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వడంతో ఉపాధ్యాయ సమస్యలు శాసనమండలిలో పరిష్కరించడానికి వీలు పడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి కోడ వెంకట సురేష్ కుమార్, సీనియర్ నాయకులు శోభ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ వనుగు దేముడు, యూనిట్ ఇన్చార్జులు తామర మూర్తి బాబు, కొంతేలి వెంకటప్రసాద్,యువనాయకులు ముడవ శ్రీనివాస్, కొర్రా కృష్ణ. తదితరులు పాల్గొన్నారు.