ఆరు పంచాయితీలప్రజల సౌకర్యార్థం రహదారిని మరమ్మతులు చేపట్టాలి. సామాజిక సేవకుడు" అర్జున్ రెడ్డి"

Rtv Rahul
0
25 గ్రామాల ప్రజల సౌకర్యార్థం రహదారిని మరమ్మతులు చేపట్టాలి 

ఎన్నిసార్లు విన్నవించిన స్పందించని అధికారులు ప్రజాప్రతినిధులు 

సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి 

RTVNEWS (లవకుశ)కొయ్యూరు మండలం ఆరు పంచాయితీలో 25 గ్రామాల ప్రజలు నిత్యం ప్రయాణాలు సాగించే రహదారిని మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించిన ఎటువంటి స్పందన కానరావడంలేదని సామాజిక సేవకులు అర్జున్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక విలేకరులకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ మండలంలో కొమ్మిక, కంటారం, బాలారం, బకులూరు, ఆడాకుల, ఆర్ కొత్తూరు పంచాయతీలో గల గ్రామాల ప్రజలు నిత్యం ఈ రహదారిపై ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటారన్నారు. రోడ్డు నిర్మాణం చేసేటప్పుడే నాణ్యమైన రహదారి నిర్మించకపోవడంతో వర్షాలు కురవడం వల్ల రహదారి శిధిలావస్థకు చేరుకొందని అన్నారు ఇదే రహదారి బరంపేట గ్రామాల మీదుగా కూడా ఉందని తెలిపారు. గడచిన ఐదేళ్ల కాలంలో అనేక రూపాల్లో అధికారులకు ప్రజా ప్రతినిధులకు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియజేసినప్పటికీ అధికారులు ప్రజాప్రతిని స్పందించిన దాఖలాలు లేవని ఆయన అన్నారు. ముఖ్యంగా మండల కేంద్రానికి ఈ ఆరు పంచాయతీలో ప్రజలు ఇదే రహదారి గుండా ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారని రహదారి శిథిలావస్థకు చేరుకొని గుంతల మయంగా దర్శనం ఇవ్వడంతో రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయన తెలిపారు ఇప్పటికైనా అధికారులు కూటమి ప్రభుత్వంలో నాయకులు స్పందించి ప్రజల సౌకర్యార్థం రహదారిని పునర్మించాలని అని డిమాండ్ చేశారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">