.
ప్రభుత్వ పథకాలు, పీసా పై డ్వాక్రా మహిళలు అవగాహాన కలిగిఉండాలి.
ఎంపీడీవో "ఎస్ కె వి ప్రసాద్ "
RTVNEWS (లవకుశ)రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలతో పాటు పీసా కమిటీ వంటి చట్టాలపై ప్రతి డ్వాక్రా మహిళా సభ్యులు పూర్తి అవగాహాన కలిగి ఉండాలని ఎంపీడీవో ఎస్ కె ఎల్ ప్రసాద్, ఏపిఎస్ఐ అర్డి (పి అర్) డిప్యూటి డైరక్టర్ ఏ.రామ నాథం శిక్షణ అబ్జరర్ డి టి ఎం చిన్నారావు లు అన్నారు. కొయ్యూరు మండల పరిషత్ మందిరంలో బుధవారం ఎంపీడీవో ఎస్ కె ఎల్ ప్రసాద్ ఆధ్వర్యంలో వెలుగు డ్వాక్రా సంఘాల మహిళలకు పీసా చట్టం, ఇతర ప్రభుత్వ పతకాల పై అవగాహాన శిక్షణ కల్పించారు. మండల పరిధిలో 236 మంది తో తొలి రోజు ఈ శిక్షణ నిర్వహించారు. డ్వాక్రా సంఘాలు ప్రతి స్వయం సహాయక సంఘాల లో ఒక సభ్యులు రెండు బ్యాచ్ లకు ఈ ప్రత్యేక శిక్షణ కల్పిస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ప్రభుత్వం అందించే ప్రతి కార్యక్రమం మరియు పథకాలపై వీరికి పూర్తి గా వివారించారు. కార్యక్రమంలో శిక్షణ కో ఆర్డినేటర్ మరియు డిజిటల్ అసిస్టెంట్ పి.ప్రసద్ మరియు వెలుగు ఏపిఎం తదితరులు పాల్గొన్నారు.