శ్రీశ్రీశ్రీ ఎర్ర కొండమ్మ ఆలయంలో హుండీ చోరి
ఈ ఏడాది మూడవసారి దొంగతనం
RTVNEWS (లవకుశ)కోర్కెలు తీర్చే కల్పవల్లి గిరిజన ప్రాంత ఆరాధ్య దైవం అయిన శ్రీశ్రీశ్రీ ఎర్ర కొండమ్మ ఆలయంలో హుండీ శనివారం చోరికి గురైంది.కొయ్యూరు మండలం శరభన్నపాలెం, నడింపాలెం గ్రామాల మధ్య వెలసిన ఎర్ర కొండమ్మ ఆలయంలో భక్తులు సమర్పించే కానుకుల హుండీ ని గుర్తుతెలియని వ్యక్తులు శనివారం పగలగొట్టి అందులో ఉన్న నగదును దోచుకెళ్లారని ఆలయ పూజారి గ్రామస్తులు తెలిపారు. ఈ ఏడాదిలో మూడోసారి హుండీ చోరీకి గురి కావడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ఆలయ అభివృద్ధి కమిటీ పటిష్ట చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.