కూటమి ఆదివాసీ నాయకులు స్పందించేది ఇప్పుడా?:ఆదివాసీ పార్టీ
RTVNEWS (లవకుశ)కూటమి ఆదివాసీ నాయకులు స్పందించేది ఇప్పుడా అని భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు ప్రశ్నించారు.కూటమిలో భాగస్వాములైనా తెదేపా, జనసేన,బిజెపి ఆదివాసీ నాయకులు గత నెల 27వ తారీఖునుండి 1/70 చట్టం మీద ఎటువంటి ప్రకటన చేసేందుకు ముందుకు రాలేదని,నిజానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడుకి నోటి దురద ఎక్కువని అందరికీ తెలిసిన విషయమే,జనవరి 27 వ తారీఖున విశాఖపట్నం లో అయ్యన్న మాట్లాడిన తర్వాత కూటమి ఆదివాసీ నాయకులుగా గట్టిగా స్పందించవచ్చు,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యరాణి,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించే వరకు కూటమిలో ఉన్న ఒక్క నాయకుడు స్పందించలేదంటే వీరు రాజకీయాల్లో ఎందుకు ఉన్నట్లు,రాజకీయాల్లో ఉన్నప్పుడు తన,మన భేదం లేకుండా పనిచేయాలని,నిజానికి అయ్యన్న పాత్రుడు వ్యక్తిగతంగా మా కుటుంబానికి గత 40 ఏళ్లుగా బాగా తెలుసు,అయినా ఆదివాసీగా నేను స్పందించాను.కూటమి ఆదివాసీ నాయకులకు ఆదివాసేతరులనుండి వ్యక్తిగతంగా అవమానం,వ్యక్తిగత నష్టం జరిగితే ఇలాగే భరిస్తారా,జాతి ముఖ్యం,పార్టీ,పదవులు కాదు.రాజకీయాల్లోకి వచ్చింది జాతిని రక్షించుకోవడానికా లేదా ఆ పేరుతో సంపాదించుకోవడానికా, జాతిని తాకట్టు పెట్టేసిన మీరు మారు మాట్లాడకుండా ఉంటారేమో,తరం మారింది మీరు మారండి లేదంటే అదో గతేనని తీవ్రంగా హెచ్చరించారు.