వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే అర్హత లేదు. దేవరపల్లి సర్పంచ్. "సిరి బాల బుజ్జిబాబు"

Rtv Rahul
0
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి  మాట్లాడే అర్హత లేదు

అయ్యన్న వ్యాఖ్యలను ఆదివాసీలుగా ఖండిస్తున్నాం

దేవరాపల్లి సర్పంచ్ సిరిబాల బుజ్జిబాబు 


RTVNEWS (లవకుశ)ఆదివాసీల హక్కుల్ని, చట్టాల్ని హరించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి  మాట్లాడే అర్హత లేదని, 
సభాపతి అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలను ఆదివాసీలుగా ఖండిస్తున్నామని దేవరాపల్లి సర్పంచ్ సిరిబాల బుజ్జిబాబు అన్నారు. సోమవారం విలేకరులకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ నిన్నటి వరకు అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెందిన ఏడుగురు ఆదివాసీ ఎమ్మెల్యేలు షెడ్యూల్ ప్రాంతంలో 1/70 చట్టానికి వ్యతిరేకంగా గిరిజనేతరులకు గృహనిర్మాణాల కోసం ఒకటిన్నర సెంట్ల భూమిని ఇవ్వాలని  ముఖ్యమంత్రి కార్యాలయం(సియంఓ)కి లేఖ వ్రాసారని,షెడ్యూల్డ్ ప్రాంతంలో శతశాతం ఉద్యోగం కల్పించే జిఓ నెంబర్ 3ని సుప్రీంకోర్టు రద్దు చేస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెందిన వారు ఒక్కరు కూడా మాట్లాడ లేదన్నారు.బోయవాల్మీకులను గిరిజన జాబితాలో కలపాలని ఎస్టీ కమిషన్ తీర్మానం చేసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారని, అప్పటి ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కుంభ రవిబాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ,సభ్యుడే పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు,గిరిజనులకు బెస్ట్ ఎవైబుల్ స్కూల్స్  తీసేస్తే ఆ పార్టీ నాయకులు మాట్లాడ లేదన్నారు ఇవే కాకుండా చాలా విషయాల్లో ఆదివాసీలకు అన్యాయం చేస్తే మాట్లాడని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆదివాసీల పక్షపాతులుగా వర్ణించుకోవడం సిగ్గుచేటని,సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి,ఆదివాసీలను దగ్గర నుండి చూసిన శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదివాసీల భూముల రక్షణ చట్టమైనా 1/70 భూబదాలయింపు నిషేధచట్టం సవరణ చేయాలనడం ఆదివాసీల మనోభావాలు దెబ్బ తిన్నాయని, అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలను  ఖండిస్తూన్నామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">