ఎమ్మెల్యే గారు... ఎల్ టి ఆర్ చట్టం ఉల్లంఘన అవుతుంది పట్టించుకోండి.. ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ "మెట్టడం రాజబాబు"

Rtv Rahul
0
ఎమ్మెల్యే గారు.... ఎల్టీఆర్ చట్టం  ఉల్లంఘన అవుతుంది,పట్టించుకొండి:ఆదివాసీ జెఏసి

RTVNEWS (లవకుశ)ఎమ్మెల్యే గారు ఎల్టీర్ చట్టం (భూబదాలయింపు నిషేధ చట్టం)ఉల్లంఘన అవుతుంది పట్టించుకొండని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజుకు సూచించారు.భూబదాలయింపు నిషేధ చట్టమైన 1/70 చట్టం సవరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో ఏజెన్సీ బంద్ ని ప్రకటించిన నేపథ్యంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి,చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సవరణ చేయమని,ఆదివాసీల చట్టాలను గౌరవిస్తామనీ,పరిరక్షిస్తామని ప్రకటించారు.ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి ప్రకటన చేసిన వారం రోజుల్లో 5 వ షెడ్యూల్డ్ ప్రాంతంలో పూర్తిగా 1/59,1/70 చట్టాలు  అమలులో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం ఆడాకులలో 27 మంది,ఆర్. కొత్తూరులో 8 మంది గిరిజనేతర రైతులు తాము సాగుచేసుకొంటున్న భుములను వెబ్ ల్యాండ్ లో నమోదు చేసి,ఈ-పాస్ పుస్తకాలు ఇవ్వాలని కలెక్టర్ ని కోరడంతో ఆఘామేఘాల మీద రెవెన్యూ శాఖ గ్రామ సభ ఏర్పాటుకు సంసిద్ధతమైతే,5వ షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనేతరులతో గ్రామ సభ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని జనవరి నెలలో ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జెఏసిగా అడ్డుకొంది.ప్రభుత్వం నిర్వహించే సభలు,సమావేశాలకు 3 రోజుల ముందుగానే పత్రిక ప్రకటన చేయాల్సి ఉంది,కానీ ఈ నెల 18వ తారీఖున ఆడాకుల గ్రామంలో గ్రామ సభ ఉందని 17వ తారీఖున పత్రిక ప్రకటన చేయడం దేనికి సంకేతం,మరో వైపు ఎమ్ఎల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అయినా సభ నిర్వహించారు.ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జెఏసి కొయ్యూరు మండల కమిటీ కన్వీనర్ సాగిన సంజీవ్,కోకన్వీనర్ ఉల్లి సూరిబాబు,జిల్లా కోకన్వీనర్ పాడి లోవరాజు,అశోక్ లాల్,పద్మశ్రీను,శ్యామల వరలక్ష్మి ఇంటలెక్సవల్ సభ్యుడు పాపారావు తదితరులు ఆ సభకు హాజరై 5వ షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనేతరులకు పట్టాలు ఇవ్వడం చట్ట ఉల్లంఘన అవుతుందని,ఎట్టి పరిస్థితిలోను పట్టాలు ఇవ్వొద్దని సభలో  తహశీల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు.ఇంత జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యేగా ఎందుకు స్పందించడం లేదని,ఉద్యమాలకు పేటెంట్ హక్కులు మావేనని చెప్పుకునే కమ్యూనిస్టులు ఎక్కడ కనిపించడం లేదు.భూబదాలయింపు నిషేధ చట్టం విషయంలో అయ్యన్న వ్యాఖ్యాలకు రియాక్ట్ అయ్యి, ఆడాకుల ఆదివాసేతరులకు సపోర్ట్ గా ఉండవద్దని హితవు పలుకుతూ,5 వ షెడ్యూల్డ్ భూభాగం కాపాడు కోవల్సిన భాధ్యత ప్రతి ఆదివాసీ పైన ఉందని,తేడా వస్తే పోరాటానికి సిద్ధంగా ఉండాలని రాజబాబు పిలుపునిచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">