ఈశ్వరమ్మా....మీకు 5వ షెడ్యూల్డ్ గురించి తెలుసా?
ఆదివాసీ జెఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ "మొట్టడం రాజబాబు"
RTVNEWS (లవకుశ)ఈశ్వరమ్మా....మీకు రాజ్యాంగంలో 5వ షెడ్యూల్డ్ గురించి తెలుసా అని పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జెఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం విలేకరులకు విడుదల చేసిన ప్రకటనలో రాజబాబు మాట్లాడుతూ1950 జనవరి 26 తారీఖున భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది, అదేరోజే రాజ్యాంగంలో 5వ షెడ్యూల్డ్ కూడా అమలులోకి వచ్చిందని అన్నారు. 5వ షెడ్యూల్డ్ భూభాగం ఆనాడే ఏర్పాటు చేసారని.5వ షెడ్యూల్డ్ లో గిరిజనేతరుల గురించి ప్రస్తావనే లేదన్నారు.1979 సంవత్సరంలో నర్సీపట్నం తాలుకా లో ఉన్న ఆడాకుల,ఆర్. కొత్తూరు,బాలరం,కంఠారం గ్రామాలు చింతపల్లి తాలుకా, పాడేరు డివిజన్ లో కలిపారని,ఆయా గ్రామాలలో ఉన్నా గిరిజనేతరులకు పట్టాలివ్వాలని 2018 డిసెంబర్ 25 వ తారీఖున ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శికి మీరు ఎమ్మెల్యేగా లెటర్ వ్రాసారని అన్నారు.అప్పటి చింతపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా 1972 లో ఇంగువ రామన్నపడాల్, 1978 లో దేపూరి కొండలరావు,1983 లో కోరాబు వెంకటరత్నం,1985 లో మొట్టడం వీర వెంకట సత్యనారాయణ,1989 లో పసుపులేటి బాలరాజు,1994 లో గొడ్డేటి దేవుడు,1999 లో మొట్టడం వీర వెంకట సత్యనారాయణ,2004లో గొడ్డేటి దేవుడు ఎమ్మెల్యేలు అయ్యారు.నియోజక వర్గాల పునర్విభజన తర్వాత పాడేరు ఎమ్మెల్యే గా 2009లో పసుపులేటి బాలరాజు అయ్యారు.వీరందరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే.వీరి కాలంలో ఏనాడు ఈ ప్రస్తావన రాలేదని,మీరు 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత కొయ్యూరు మండలం ఆడాకుల,ఆర్.కొత్తూరు మరియు 11 గ్రామాలకు చెందిన గిరిజనేతర రైతులకు పట్టాలు ఇవ్వాలని 2018 డిసెంబర్ 25 న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,రెవెన్యూ శాఖ వారికి లెటర్ వ్రాయడమంటే ఎంత దారుణం.ఆదివాసీలకు ఏజెన్సీలో భూబదాలయింపు నిషేధచట్టం 1917లోనే బ్రిటీషు ప్రభుత్వం తీసుకొచ్చి అమలు చేసారు.భారత స్వాతంత్ర్యం అనంతరం 1959 లో,1970లో 1/59,1/70 భూబదాలయింపు నిషేధ చట్టాలను భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆదివాసీగా 5వ షెడ్యూల్డ్ ని కాపాడుతారని ఉద్దేశంతో ఆదివాసీలు ఓట్లు వేస్తే ఆదివాసేతరులతో కుమ్మక్కు అవుతారా,ఆదివాసీల ఖర్మ మీలాంటి వారికి అసెంబ్లీకి పంపడం,మొన్న ఈమధ్య పోలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చిన్న మెదడు చితికి పోయినవాడిలా మాట్లాడుతున్నారు,మీకన్నా ముందు ఎమ్మెల్యేలు లేరు అనుకుంటున్నారా, మీ తర్వాత రారు అనుకుంటున్నారా,నేటి రాజకీయమే రేపటి చరిత్ర(టుడే పాలిటిక్స్ టుమారో హిస్టరీ),ఆదివాసీ హక్కులు, చట్టాలను కాపాడుకోలేని చరిత్ర హీనులుగా,జాతి ద్రోహులుగా మారకండని ఆయన హితవు పలికారు.