*1/70 చట్టానికి వైసిపి కూడా తూట్లు పొడవడానికి చూసింది:ఆదివాసీ పార్టీ*
RTV NEWS (లవకుశ)1/70 భూబదాలయింపు నిషేధ చట్టానికి వైసిపి కూడా తూట్లు పొడవడానికి చూసిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఆదివాసీల చట్టాల మీద సదభిప్రాయమేమీ లేదని భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు అన్నారు.వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏడుగురు ఆదివాసీ ఎమ్మెల్యేలు షెడ్యూల్ ప్రాంతంలో 1/70 చట్టానికి వ్యతిరేకంగా గిరిజనేతరులకు గృహనిర్మాణాల కోసం ఒకటిన్నర సెంట్ల భూమిని ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం(సియంఓ)కి లేఖ వ్రాసారు.వైసిపికి చెందిన అప్పటి ఆదివాసి ఎమ్మెల్యే 1/70 చట్టం ఉండటం వల్లే ఏజెన్సీ కి పెట్టుబడుల రావడం లేదని అన్నారు.1/70 చట్టం,పీసా చట్టానికి వ్యతిరేకంగా షిర్డీసాయి ఎలక్ట్రికల్ సంస్థకు చింతపల్లి మండలం ఎర్రవరంలో హైడ్రోపవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాడేరు సభలో 1/70 చట్టానికి వ్యతిరేకంగా గిరిజనేతరులకు గృహ నిర్మాణాలకు సెంటున్నర స్థలం ఇవ్వాలని నిర్ణయించారు, 1/70 చట్టానికి వ్యతిరేకంగా బాక్సైట్ మైనింగ్ తవ్వకాల కోసం చింతపల్లిలో ఆదివాసీలు మాట్లాడడానికి అవకాశం లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ జరిపించారు.తెలుగు దేశం పార్టీ,కూటమి ప్రభుత్వం మాత్రమే కాదు ఆదివాసేతర పార్టీలన్ని 1/70 భూబదాలయింపు నిషేధచట్టానికి వ్యతిరేకమని మరొక్కసారి ఆయన స్పష్టం చేశారు.