1/70 యాక్ట్ మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదు
1/70 యాక్ట్ ను పూర్తిస్థాయిలో పరిరక్షిస్తాం
ఆదివాసి చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
మాజీ జిసిసి చైర్మన్ రాష్ట్ర టిడిపి కార్యదర్శి "ఎం వి వి.ప్రసాద్"

RTVNEWS (లవకుశ)1/70 యాక్టును మార్చే ఎలాంటి ఆలోచన రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి లేదని ,ఆదివాసి చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వము కట్టుబడి ఉందని మాజీ జిసిసి చైర్మన్, రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎంవివి ప్రసాద్ తెలియజేశారు. మంగళవారం స్థానిక విలేకరులకు విడుదల చేసిన ప్రకటనలో ప్రసాద్ మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వ హాయములో రద్దయిన జీవో నెంబర్ త్రీ ని పునరుద్దించి గిరిజనులకు గిరిజన ప్రాంతాల్లో 100% ఉద్యోగ కల్పనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారని ఆయన అన్నారు. గిరిజనుల ఆత్మగౌరవం, చట్టాలను గౌరవిస్తామని కూటమి ప్రభుత్వంలో గిరిజనులకు ఎటువంటి హాని తలపెట్టే ఏ ఆలోచన చేయమని నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో గిరిజన సోదరులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దని ఆలోచన చేయాలని సూచించారు. ముఖ్యంగా గిరిజనులకు మెరుగైన సంక్షేమ పాలన అందిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రసాద్ ఈ సందర్భంగా తెలియజేశారు