1/70 చట్టం సవరణ చేయాలన్న అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై 12న మన్యం బంద్:
ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ "మొట్టడం రాజబాబు"
RTVNEWS( లవకుశ)1/70 భూబదాలయింపు నిషేధ చట్టం సవరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా మన్యం బంద్ కు ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జెఏసి పిలుపునిచ్చిందని జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు తెలిపారు సోమవారం స్థానిక విలేకరులకు విడుదల చేసిన ప్రకటనలో రాజబాబు మాట్లాడుతూ.జనవరి 27 వ తేదీన విశాఖపట్నంలో ఆంధ్ర్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ షెడ్యూల్ ప్రాంతంలో 1/70 చట్టం సడలిస్తే ఇన్వెస్టర్లు ముందుకు వస్తారని వివాదస్పదమైన వ్యాఖ్యలపై ఆదివాసీ సమాజం తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జెఏసి ఆధ్వర్యంలో ఈ నెల 12 తేదీన ఆంధ్ర ప్రదేశ్ లో గల మన్యం ప్రాంతాల్లో బంద్ కు పిలుపునిచ్చిందని అన్నారు.భూబదాలాయింపు నిషేధచట్టం సవరిస్తే షెడ్యూల్ ప్రాంతం పూర్తిగా నాశనమౌతుందని,చట్టం ఉన్నప్పుడే అమలు చేయకపోవడంతో ఉల్లంఘన జరుగుతోందని,చట్టమే సవరిస్తే మన్యానికి అధోగతేనని,ఆదివాసీల పోరాటాలతో భూ బదలాయింపు నిషేధచట్టం 1917లో బ్రిటీషు ప్రభుత్వం హయాంలోనే వచ్చిందని,స్వాతంత్ర్యం అనంతరం 1959లో,1970లలో మరిన్ని సవరణలు చేసి చట్టం కఠిన తరం చేసారని తెలిపారు,కానీ అమలు చేయడంలో విఫలమయ్యారని, 5వ షెడ్యూల్ ప్రాంతం గురించి మాట్లాడే హక్కు శాసనసభాపతిగా అయ్యన్న పాత్రుడుకి లేదని,తన పరిధి మించి మాట్లాడమే కాకుండా 1/70చట్టం గురించి అవగాహన లేదని అయ్యన్న పాత్రుడు అనడం శాసనసభాపతి పదవికి అనర్హడని,అయ్యన్న పాత్రుడు శాసనసభాపతిగా కాకుండా నాటకాల్లో హశ్యగాడిలాగా వ్యవహారించడం వల్ల తెలుగు ప్రజలు సిగ్గు పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు.