11,12 తేదీల్లో జరిగే మన్యం బంద్ లో పార్టీలకు అతీతంగా పాల్గొనాలి.. వైసిపి జిల్లా కార్యదర్శి "సుమర్ల సూరిబాబు"

Rtv Rahul
0
11,12 తేదీల్లో  మన్యం బంద్ లో పార్టీలకు అతీతంగా పాల్గొనాలి

వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి "సుమ్మర్ల సూరిబాబు"



RTV NEWS( లవకుశ)ఈనెల 11, 12 తేదీల్లో జరిగే మన్యం బంద్ లో పార్టీలకు అతీతంగా భారీ ఎత్తున గిరిజనులు పాల్గొనాలని వైఎస్ఆర్సిపి అల్లూరి జిల్లా కార్యదర్శి సుమ్మర్ల సూరిబాబు, భూధ రాళ్ల పంచాయతీ వర్కింగ్ ప్రెసిడెంట్ కంకిపాటి శివకుమార్ తెలిపారు. శనివారం స్థానిక విలేకరులకు విడుదల చేసిన ప్రకటనలో వారు మాట్లాడుతూ గిరిజన చట్టాలు కోసం గిరిజనుల జీవన మనుగడ కోసం పోరాటం చేయడానికి అందరూ కలిసి ఒకే తాటిపైకి రావాలని వారు కోరారు. రాజ్యాంగం పదవులు ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు 1/70 సవరించాలని మాట్లాడడం గిరిజన ఆదివాసుల మనోభావాలను దెబ్బతీసేటట్లుగా ఉన్నాయని తక్షణమే అయ్యన్నపాత్రుడు గిరిజనులు అందరికీ క్షమాపణ చెప్పాలని అలాగే 11 12 తేదీల్లో జరిగే బందును విజయవంతం చేయాలని వారు కోరారు ముఖ్యంగా బందు రోజు మండల కేంద్రానికి ప్రతి ఒక్క గిరిజనుడు తరలివచ్చి బందును విజయవంతం చేసేందుకు కృషి చేయాలని వారు కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">