అధికారులునల్ల రాయి క్వారీని తక్షణమే నిలుపుదల చేయాలి.
ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి "కూడా రాధాకృష్ణ."
ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి "లక్ష్మణ్ "డిమాండ్.
RTVNEWS(లవకుశ).దేవరపల్లి ,కురిడేమెట్టు గ్రామాల మధ్యలో నడుపుతున్న నల్లరాయి క్వారీ తక్షణమే నిలుపుదల చేయాలని, ఏపీ గిరిజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్తుల నుండి గిరిజన సమాఖ్య నాయకులు పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల అందించిన వివరాల ప్రకారం నల్ల రాయి క్వారీ బ్లాస్టింగ్ వల్ల చిన్నపిల్లలు, గర్భిణీలు, మృత్యువాత పడిన పరిస్థితులు నెలకొన్నాయి అన్నారు.ఇల్లు పూర్తిగా పగిలిపోయింది. చేతికి అందించిన పంట పూర్తిగా నష్టపోయిందని. అనేకమంది టీవీలు పగిలిపోవటం జరిగాయని అన్నారు. బ్లాస్టింగ్ వల్ల వచ్చే దుర్వాసనలు భరించలేకపోతున్నమని తెలిపారు అనేక ఇబ్బందులు పడుతున్నామని తక్షణమే నల్ల రాయి క్వారీ ఆపాలని, గ్రామస్తులు వాపోయారు. ఆదివాసులకు నష్టం కలిగే నల్ల రాయి బ్లాస్టింగ్ తక్షణమే నిలుపుదల చేయాలని, ఆ బ్లాస్టింగ్ వల్ల అనేక ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తుందని, అన్నారు గ్రామస్తులు ఎటువంటి నిర్ణయం చేపట్టిన ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్యగా సంపూర్ణంగా మద్దతిస్తున్నామని తెలుపుతామన్నారు. ఏది ఏమైనా ఆదివాసులకు నష్టం కలిగించే నల్లరాయి క్వారీని తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో గ్రామస్తులు. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.