మరణించిన స్నేహితుడు కుటుంబానికి అండగా నిలిచిన పూర్వపు విద్యార్థులు.

Rtv Rahul
0
స్నేహితుడి కుటుంబానికి పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం 

ఇద్దరు పిల్లలు కు 40వేలు రూపాయలు ఫిక్స్ డిపాజిట్ 



RTVNEWS (లవకుశ)ఆకస్మికంగా బ్రెయిన్ స్ట్రోక్ తో ఆకస్మృతి చెందిన స్నేహితుడు కుటుంబానికి పూర్వపు విద్యార్థులు అండగా నిలిచి పలువురికి ఆదర్శంగా నిలిచారు. గొలుగొండ మండలం కృష్ణా దేవి పేట ప్రభుత్వ జడ్పీ హైస్కూల్లో 1995- 96 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న లక్కోజు అప్పలాచారి ఇటీవల ఆకస్మికంగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తన తోటి స్నేహితులందరూ 40 వేల రూపాయలు సేకరించి అప్పలాచారి ఇద్దరు కుమార్తెలు పేరుపై పోస్టల్ ఆఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి కుటుంబ సభ్యులకు బాండ్లను అప్పగించారు. స్నేహితుడు చనిపోయిన కుటుంబానికి అండగా నిలిచిన పూర్వపు విద్యార్థులు ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాలపర్తి సత్యనారాయణ, లాలం అప్పలనాయుడు, ఊడ రమేష్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">