బూధ రాళ్లను మూడు గ్రామ పంచాయతీలుగా విభజించి అభివృద్ధి చేయండి
మీకోసం లో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు వినతి పత్రం
బూదరాళ్ల సర్పంచ్ సాగిన ముత్యాలమ్మ, వార్డ్ మెంబర్ సంజీవ్.
RTVNEWS (లవకుశ)కొయ్యూరు మండల కేంద్రానికి సుదూర ప్రాంతంలో విసిరి పడేసినట్లు ఉండే బూధ రాళ్ల ను మూడు గ్రామ పంచాయతీలుగా విభజించి అన్ని విధాలా అభివృద్ధి చేసి తమ గిరిజనులను ఆదుకోవాలని అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వినతి పత్రం అందివ్వడం జరిగిందని బూధ రాళ్ల సర్పంచ్ సాగిన ముత్యాలమ్మ సాగిన సంజీవ్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన పాడేరులో నిర్వహించే మీకోసం కార్యక్రమంలో వినతిపత్రం అందజేయడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూధ రాళ్ల మేజర్ పంచాయతీలో 36 గ్రామాలు ఉండగా ఎనిమిది వేలకు పైబడి జనాభా కలిగి ఉన్నారని, అలాగే విస్తీర్ణ పరంగా కూడా దేశంలోని అతిపెద్ద పంచాయతీ అన్నారు. దీంతో అభివృద్ధికి నోచుకోని అనేక గిరిజన గ్రామాలు నేటికీ ఉన్నాయన్నారు. ముఖ్యంగా మండల కేంద్రానికి 50 కిలోమీటర్ల పైబడి దూరం లో ఉన్న మేజర్ పంచాయతీ బూధ రాళ్లను మూడు గ్రామపంచాయతీలుగా బాలరేవుల పోకల పాలెం, గరిమండ, విభజన చేపట్టి ప్రజల యొక్క సౌకర్యార్థం పరిపాలన సౌలభ్యం కొరకు నూతన పంచాయతీలను పునర్విభజన చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని తెలిపారు.. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అవకాశాన్ని బట్టి కచ్చితంగా ప్రజల సౌకర్యం పరిపాలన సౌలభ్యం కోసం విభజన చేస్తామని హామీ ఇచ్చారని సర్పంచ్ ముత్యాలమ్మ వార్డు మెంబర్ సంజీవ్ లు తెలియజేశారు