పెసా ఎన్నికలు రీపోలింగ్ నిర్వహించాలి. ఎంపీడీవో ఎస్ కె వి ప్రసాద్ కు సామాజిక సేవకుడు" అర్జున్ రెడ్డి"

Rtv Rahul
0
పెసా ఎన్నికల్లో గిరిజనేతరులకు ప్రాధాన్యత ఇచ్చిన చోట్ల రీ పోలింగ్ నిర్వహించాలి

ఎంపీడీవో ఎస్ కె వి ప్రసాద్ కు ఫిర్యాదు 

సమాచార హక్కు చట్టం కోఆర్డినేటర్ "అర్జున్ రెడ్డి"

 

RTVNEWS( లవకుశ)ఇటీవల జరిగిన పెసా ఎన్నికల్లో గిరిజనేతర్లకు ప్రాధాన్యం కల్పించిన చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఎంపీడీవో ఎస్ కె వి ప్రసాద్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని సామాజిక సేవకుడు, జిల్లా సమాచార హక్కు చట్టం కోఆర్డినేటర్ అర్జున్ రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక విలేకరులకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ మండలంలో గత శుక్రవారం మూడవ తేదీన జరిగిన ఎన్నికల్లో కొమ్మిక పంచాయతీ, కొప్పుకొండ, కొత్త తుమ్మలమంద, పాత తుమ్మల బంధ, రేవళ్లు, ఊర్లోది, తాళ్లపాలెం ఈ ఏడు చోట్ల పెసా చట్టం ఎన్నికలు రీపోలింగ్ నిర్వహించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెసాచట్టం ఎన్నికలు కోరం లేకుండా తూతూ మంత్రంగా జరిగాయని ప్రజలకు పెసా ఎన్నికలు జరుగుతున్నాయని సరైన సమాచారం కూడా ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించడం జరిగిందని అన్నారు. గిరిజన ప్రాంతంలో గిరిజనుల చట్టాలకు వ్యతిరేకంగా చట్టాలను హరిస్తూ ప్రజలకు సమాచారం అందించకుండా ఎన్నికలు అధికారులు రాజకీయ నాయకులు ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించాలని ఆరోపించారు పీసా ఎన్నికల అధికారులు ఎన్నికల నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఎన్నికల అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కొప్పుకొండ పరిధిలో ఏడికి గ్రామాలకు నిర్వహించాలని ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో టిడిపి మండల ప్రధాన కార్యదర్శి మాతే గణేష్ కొమ్మిక పంచాయతీ యూనిట్ ఇన్చార్జ్ గాలి చిన్నారావు కొప్పుదేవుడు పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">