పది లక్షల రూపాయలు అవినీతికి పాల్పడిన సిహెచ్ నాగపురం సర్పంచ్ టిడిపి నాయకులపై విమర్శలా!
నాగపురం మాజీ సర్పంచ్ కోలగాన రామారావు ఎద్దేవా!
RTVNEWS (లవకుశ )పంచాయితీ అభివృద్ధి పనుల్లో పాటు, రామాలయం నిర్మాణం పేరుతో పది లక్షల రూపాయలు అవినీతికి పాల్పడ్డ సిహెచ్ నాగపురం సర్పంచ్ ఎలమంచిలి రఘురామచంద్రరావు పై చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ మాజీ సర్పంచ్ కొలగాన రామారావు టిడిపి నాయకులు బొప్పన ప్రసాదు డిమాండ్ చేశారు. బుధవారం సిహెచ్ నాగపురంలో విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొలగాన రామారావు, బొప్పన ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గ్రామంలో పంచాయతీ నిధులు 3 లక్షలు, దేవాలయం నిర్మాణం పేరుతో ఏడు లక్షలు రూపాయలు అవినీతికి పాల్పడ్డారని వీరు ఆరోపించారు. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసామన్నారు. అయితే గ్రామ సర్పంచ్ అవినీతికి పాల్పడి 2013, 2018 పదవి కాలంలో టిడిపి సర్పంచ్ కొలగాన రామారావు, టిడిపి నాయకులు మరుగుదొడ్లులో అవినీతి చేశారని ఆరోపిస్తూ అధికారులకు ఫిర్యాదు చెయ్యడం హాస్యాస్పదమని ఎద్దేవ చేశారు. వైసిపి పార్టీ నుండి గెలుపొందిన సర్పంచ్ బాధ్యతలు తీసుకునే ముందు అవినీతి కనిపించలేదా అని ప్రశ్నించారు. తీరా గ్రామ సర్పంచ్ అవినీతిలో కూరుకు పోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక టిడిపి నాయకులు పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆలయ నిర్మాణంలో ఏడు లక్షల రూపాయలు ఏమయ్యా అని సమాధానం చెప్పాలంటూ గ్రామస్తులు అడిగినప్పటికీ సమాధానం చెప్పకపోవడం సిగ్గుచేటని అన్నారు. వైసీపీ సర్పంచ్ రఘు రామచంద్ర రావు అంగన్వాడి టీచర్ పోస్టుకు ఐదు లక్షలు, జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో ఒక్కో లబ్ధిదారు నుండి₹2, వేల రూపాయలు చొప్పున వసూలు చేశారని ఆరోపించారు. అలాగే జలసిరి బోరు లో ప్రభుత్వాన్ని మోసం చేసి జలసిరి బోరు లబ్ధి పొందారని అన్నారు. ఇలాంటి వ్యక్తి దెయ్యాలు వేదాలు వల్లినట్లు మాపై బురద చల్లడం సమంజసం కాదన్నారు. వీటన్నిటిపై ప్రభుత్వం అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పోలిశెట్టి జగ్గయ్య దొర సేనాపతి వరహాలబాబు దుంపలపుడి వెంకటేశ్వరరావు అప్పన సత్తిబాబు కంకిపాటి రామారావు పోలిశెట్టి సత్యనారాయణ ఎనుముల రాజబాబు తదితరులు పాల్గొన్నారు