కొయ్యూరు మండలం లో ప్రశాంతంగా పెసా ఎన్నికలు

Rtv Rahul
0
.
కొయ్యూరు మండలంలో ప్రశాంతంగా పెసా కమిటీ ఎన్నికలు


RTVNEWS (లవకుశ)టిడిపి, బిజెపి, జనసేన, వైసిపి అనే బేధం లేకుండా, గ్రామాభివృద్ధికై ఏకతాటిపైకి  రావాలని భావించిన నాయకులు ఏకాభిప్రాయంతో  పెసా ఎన్నికలను  ఏకగ్రీవం  చేశారు. జిసిసి మాజీ చైర్మన్  ఎం వి వి ప్రసాద్, ఎంపీపీ బడుగు రమేష్ బాబు నేతృత్వంలో  ఇరు పార్టీల నేతలు  బి. శివరామరాజు, సర్పంచ్ త్రినాధ్ మూర్తి పడాల్, కోసూరి రాంబాబు, ఆగూరు రాంబాబు తదితర ఇరుపార్టీ నేతలు కలిసి తుమ్మల బంధ, మంప  ఎన్నికలను ఏకగ్రీవంగా ముగించారు. మంపలో  సాగిన రామకృష్ణ వైస్ ప్రెసిడెంట్ గా, ఇంగువ అనంతలక్ష్మి కార్యదర్శిగా, తుమ్మలబందలో  ఆగూరు సత్తిబాబు వైస్ ప్రెసిడెంట్ గా, గడుతూరి కొండబాబు కార్యదర్శిగా  ఎందుకయ్యారు. ఇక కొయ్యూరులో  ఎన్నిక అనివార్యమవగా వైస్ ప్రెసిడెంట్ గా వీరయ్య దొర, వసపరి బుజ్జిబాబు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కాగా కొయ్యూరులో  అనిసెట్టి చిరంజీవి, సర్పంచ్ మాకాడ బాలరాజు, ఎంపీటీసీ మల్లికార్జున్, తోటదొరబాబు, మేడిబోయిన సత్తిబాబు మేడిబోయిన చిన్న, బూర్గులయ్య, మొట్టడం అశోక్  తదితరులు పాల్గొన్నారు. కాగా కొండ గోకిరిలో ఎన్నిక నిర్వహించగా, వైసీపీ మద్దతు దారులకు 236 కు 236 ఓట్లురాగా, టిడిపికి ఒక్క ఓటు రాలేదు. వైస్ ప్రెసిడెంట్ గా పల్లి సత్యనారాయణ, కార్యదర్శిగా మడకం గోపి ఎన్నికయ్యారు. ఇక తులబాడలో ఆదివాసి గిరిజన సంఘంనుండి వైస్ ప్రెసిడెంట్ గా కిల్లో శంకర్, కార్యదర్శిగా గెమ్మెలి రాజు  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శరభన్నపాలెంలో  ఉపాధ్యక్షులుగా శేఖర్, కార్యదర్శి గా గేమ్మెల రమణ ఎన్నిక కాగా మారుమూల బూదరాళ్లలో  కోరం లేక వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారి  ప్రకటించారు.ఆయా కమిటీల నిర్వహణ లో పలువురు టీడీపీ, వైసిపిబీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">