కృష్ణదేవి పేట హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణి
అల్లాడ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడ సురేష్
. RTVNEWS (లవకుశ )అల్లాడ ట్రస్ట్ ప్రారంభించినప్పుడు నుండి పేద విద్యార్థులకు అభ్యసన సామాగ్రిని అందజేయడం జరుగుతుందని అల్లాడ ట్రస్ట్ చైర్మన్ సురేష్ అన్నారు. మంగళవారం గొలుగొండ మండలం కృష్ణా దేవి పేట హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లాడ ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుండి పేద విద్యార్థులకు సామాగ్రిని అందజేయడం జరుగుతుందని అన్నారు దీనిలో భాగంగానే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేయడం జరిగిందన్నారు వీటితో విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలియజేశారు అనంతరం ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చక్రవర్తి మాట్లాడుతూ పేద విద్యార్థులకు అభ్యసన సామాగ్రి ఇవ్వడం అభినందనీయమని విద్యకు సంబంధించి మరిన్ని సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగభూషణం పాత కృష్ణాదేవి పేట వైస్ ప్రెసిడెంట్ దుబ్బలపూడి సహదేవుడు ఈర్లే చిన్ని పాతాళ శివ అని శెట్టి గోపి గుడివాడ శివాజీ ఎర్ర ప్రసాదు బాలం అరుణ్ తదితరులు పాల్గొన్నారు