పంచాయితీ, రామాలయం నిర్మాణం పనుల్లో పది లక్షల అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధం. నాగపురం సర్పంచ్ "ఎలమంచిలి రఘురామచంద్రరావు"

Rtv Rahul
0
పంచాయతీ, రామాలయం నిర్మాణంలో 10 లక్షలు అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధం

నాగపురం సర్పంచ్ ఎలమంచిలి రఘు రామచంద్రరావు 

  RTVNEWS (లవకుశ)అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంసిహెచ్ .నాగాపురం పంచాయతీ, రామాలయం నిర్మాణం పనుల్లో 10 లక్షల నిధులు అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సర్పంచ్ ఎలమంచిలి రఘు రామచంద్ర రావు కూటమి నాయకులకు సవాల్ విసిరారు. గురువారం విలేకరుల సమావేశంలో సర్పంచ్ రఘురాం మాట్లాడుతూ గ్రామ మాజీ సర్పంచ్ కొలగాని రామారావు, బొప్పన ప్రసాద్, సేనాపతి వరహాలు బాబు, చేసిన ఆరోపణలు ఆ వాస్తమన్నారు. పంచాయతీ నిధులు అవకతవకులు లేవని, ఆలయ నిర్మాణం నిధులు,దాతలు ఇచ్చిన డబ్బులు కు ప్రజలకు సమాధానం చెప్తాను గాని ఆలయ నిర్మాణానికి రూపాయి కూడా ఇవ్వని మీకు  సమాధానం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికే దేవాదాయ శాఖఅధికారులు ఆలయ నిర్మాణంలో ఎటువంటి అవినీతి లేదని విచారణలో తేలిందని మీకు తెలియదా అని అన్నారు. 2013 నుండి 18 వరకు మాజీ సర్పంచ్ పాలనలో మరుగుదొడ్లు ఇతర పంచాయతీ నిధుల్లో అవినీతి జరిగిందని ఫిర్యాదు చేయడంతో నాపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. అంగన్వాడి టీచర్ పోస్టుకు ఐదు లక్షలు తీసుకున్నారని మీరు చెప్పడం తప్ప అంగన్వాడీ కార్యకర్త ఎవరికి డబ్బులు ఇవ్వలేదంటూ అనేకసార్లు చెప్పడం మీకు వినిపించలేదా కనిపించలేదా అని విమర్శించారు. గ్రామంలో జగనన్న ఇళ్ల స్థలాల్లో వాలంటీర్లు నియామకంలో డబ్బులు తీసుకోలేదని వాలంటీర్లు లబ్ధిదారులు చెబుతున్న మీరు నాపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి అన్నారు. లేని పోనీ ఆరోపణలు చేస్తే 2013, 2018లో మీరు చేసిన అవినీతి అక్రమాలు పై త్వరలోనే తేలుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలు తీసుకునేందుకు నా తల్లి పింఛను, ఇంటి స్థలం , జలసిరి బోరు కు అర్హురాలని అందుకే మంజూరు అయ్యాయి తప్ప నేను ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని  తెలిపారు. అవినీతిపరులు కు అందరూ అవినీతి పరులుగా సృష్టిస్తూ గ్రామ పరువు తీయడం ఇకనైనా మానుకోవాలని ఆయన హితువు పలికారు. వైస్ సర్పంచ్ పాసిల బాలసుబ్రమణ్యం, వైసిపి నాయకులు గంట్ల బుచ్చిబాబు ఎర్రాబాబులు, దిగు మూర్తి అర్జున, జైతి రమణ,  తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">