అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి నెల 5న ఈసిసిఈ డే నిర్వహణ.
సి డి పి ఓ విజయకుమారి వెల్లడి.
RTVNEWS (లవకుశ)అంగన్వాడీ పిల్లలు పాఠశాలలకు వెళ్ళే ఏ విదంగా చదువు, ఆటలు ఉండాలనేది ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా తయారు చెయ్యటమే ప్రతి కార్యకర్త ప్రధాన లక్ష్యం అని ఐసిడిఎస్ సి డి పి ఓ కె. విజయకుమారి అన్నారు. ఇందుకోసం ప్రతి నెల 5 వ తేదీన ప్రతి అంగన్వాడీ సెంటర్ లో ఏర్లి చైల్డ్ వుడ్ కేర్ మరియు ఎడ్యుకేషన్ (ఈసిసి ఈ) ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. కొయ్యూరు మండలం కొంచవానిపాలెం, సింగవరం అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం ఐసిడిఎస్ పి ఓ సందర్శించారు. అక్కడ పిల్లల తల్లులు, గ్రామస్తులతో సమావేశం అయి ప్రీ స్కూల్ పిల్లలకు కేంద్రంలో సిలబస్ ప్రకారం నంబర్ కన్సెక్ట్ప్ పై తెలియజేసారు. పిల్లలతోనే కూరగాయల మార్కెట్ ధరలు పిలికించటం, వివిధ నిత్యావసర వస్తువులు పేర్లు ను పలికించటం చేశారు. ప్రతి నెల ఎదో ఒకటీ 5 వ తేదీన ఒక కన్స్పట్ గా తీసుకుని రైమ్స్ వలే పదే పదే పలికించి వారికి అవగాహాన కల్పించటం ద్వారా పాఠశాలకు వెళ్ళే లోగా పిల్లలు ప్రీ మెచ్యూర్టి గా తయారు అవుతారని పి ఓ విజయకుమారీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కనక మహాలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.