పి. మాకవరం పెసా కమిటీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపు. ఉపాధ్యక్షుడు "సురేష్," కార్యదర్శిగా "బుజ్జి బాబు"

Rtv Rahul
0
పి.మాకవరం పెసా ఎన్నికల్లో వైసిపి బలపర్చిన అభ్యర్థులు గెలుపు 

ఉపాధ్యక్షుడిగా "జర్తా సురేష్," కార్యదర్శి" సెగ్గె నూకరాజు" (బుజ్జి బాబు)




RTVNEWS (లవకుశ)భారత రాజ్యాంగం ప్రకారం మండలంలో వివిధ పంచాయతీలో నిర్వహించిన పెసా కమిటీ ఎన్నికల్లో చెదురు మొదరు ఘటనలు తప్ప ప్రశాంతంగా ముగి సాయి. మంగళవారం పి. మాకవరం పంచాయతీలో జరిగిన పెసా కమిటీ ఎన్నికల్లో వైసిపి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా జర్తా సురేష్ ఎన్నిక కాగా, కార్యదర్శిగా సెగ్గే నూకరాజు (బుజ్జి బాబు) ఎన్నికల్లో విజయం దుందుభి మోగించారు. ఈ సందర్భంగా సురేష్, నూకరాజు మాట్లాడుతూ నిత్యం పంచాయతీలో ప్రజలందరికీ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేశారు . అదేవిధంగా ‌పంచాయతీ అభివృద్ధికి తమ వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సెగ్గే నూకాలమ్మ, ఎంపీటీసీ సెడ్డా మల్లేశ్వరి, వైస్ సర్పంచు మనోహర్, వార్డు మెంబర్లు పంచాయతీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">