చందక గౌరినాయుడు నియామకం అన్యాయం. బిజెపి పార్టీ కార్యకర్తలు నాయకులు ఆందోళన

Rtv Rahul
0
గొలుగొండ బిజెపి పార్టీ మండల అధ్యక్ష ఎన్నిక అన్యాయం! 

బిజెపి కార్యకర్తలు నాయకులు ఆందోళన 

పోటీలో ఉన్న తోటి నాయకులకు కార్యకర్తల సమాచారం లేకుండా  చందక గౌరీనాయుడును అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎలా ఎన్నుకున్నారు. అధిష్టానం పునరాలోచన చేయాలని లేకుంటే ముకుమ్మడిగా రాజీనామా తప్పదని హెచ్చరిక

RTVNEWS( లవకుశ)చందక గౌరీ నాయుడుకి బిజెపి మండల పార్టీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఇవ్వడంపై ఆ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేశారు. ఆదివారం గొలుగొండ మండలంలో కొంగ సింగి గ్రామంలో బిజెపి నాయకులు కార్యకర్తలతో కలిసి మండల పార్టీ అధ్యక్షుడు చందక గౌరినాయుడు నియామకం ఎవరికి తెలియకుండా రహస్యంగా చేశారని అని ఆరోపించారు. అధిష్టానం పునరాలోచన చేసి తగు నిర్ణయం తీసుకోవాలని లేని పక్షంలో తామంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మండల సీనియర్ నాయకులు వార్డ్ నెంబర్  దంట్ల బాబ్జి మాట్లాడుతూ మండల పార్టీ అధ్యక్ష పదవికి నేను పోటీ చేసినప్పటికీ నాకు తెలియకుండా నా అభిప్రాయం లేకుండా పదవి కేటాయించడం సరైన పద్ధతి  కాదన్నారు. పార్టీలో 11 ఏళ్లుగా ఉంటున్న నా లాంటి వ్యక్తిని పట్టించుకోకపోవడం సోషనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ మండల బిజెపి మాజీ ఉపాధ్యక్షుడు అల్లు నూకరాజు, మాజీ ప్రధాన కార్యదర్శి పైల సత్య రామప్రసాద్, మండల ఈ బీసీ అధ్యక్షుడు కుర్రాయి శ్రీను, చిరంజీవి, రమణ, రామారావు, సత్యనారాయణ, సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">