గొలుగొండ బిజెపి మండల పార్టీ అధ్యక్షుడిగా చందక గౌరీ నాయుడు
రెండవసారి ఏకగ్రీవంగా నియామకం
RTVNEWS (లవకుశ)భారతీయ జనతా పార్టీ గొలుగొండ మండల పార్టీ అధ్యక్షుడిగా చందక గౌరీ నాయుడును రెండవసారి ఏకగ్రీవంగా పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా శనివారం బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు చందక గౌరీ నాయుడు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లా నాయకత్వం తమపై నమ్మకంతో రెండవసారి మండల పార్టీ అధ్యక్షుడిగా తనను నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో బాధ్యత గల మండల పార్టీ అధ్యక్ష పదవిని తనపై నమ్మకంతో నియమించడంతో పార్టీని మండలంలో అందరి సహకారంతో గ్రామస్థాయి నుండి మరింత బలోపేతం చేసేందుకు తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ పేద ప్రజానికానికి అందిస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.