లంగడీ ఆటల్లో జాతీయస్థాయిలో చోద్యం జడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ

Rtv Rahul
0
జాతీయస్థాయి లంగడీ ఆటల్లో చోద్యం విద్యార్థులు ఉత్తమ ప్రతిభ 

విద్యార్థులను అభినందించిన హెచ్ఎం శ్రీనివాస రావు, పి ఈ టి నూకరాజు


RTVNEWS( లవకుశ)రాష్ట్రంలో ప్రాచుర్యంలో లేని లంగడీ జాతీయ స్థాయి ఆటల పోటీల్లో చోద్యం జడ్పీ హై స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని పాఠశాల హెచ్ఎం పి శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయుడు కుందూరు నూకరాజు తెలిపారు. విజయవాడలో జరిగిన ఈ లంగడీ పోటీల్లో ఇతర రాష్ట్రాలు తో పోటీపడి గెలుపొందాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి కోచ్ గా ఆంధ్ర నుండి విద్యార్థులను తీసుకు వెళ్లడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ పి సత్తిబాబు సర్పంచ్ ఆదపరెడ్డి గోపాలకృష్ణ, మాజీ బీసీ రాష్ట్ర డైరెక్టర్ వందల రాజు మాట్లాడుతూ ప్రాచుర్యం లేని ఆటల పోటీల్లో గెలుపే లక్ష్యంగా ఈ ప్రాంతం నుండి విద్యార్థులను తీసుకు వెళ్లడంతో ఉత్తమ ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు. ఈ లంగడీ పోటీల్లో జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తీసుకువెళ్లి ఈ ప్రాంతానికి పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బోధ నేతల సిబ్బంది గ్రామ పెద్దలు పాల్గొని విద్యార్థులను పిఈటిను అభినందించారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">