పాడేరు మెడికల్ కళాశాలలో శత శాతం ఉద్యోగాలు ఆదివాసులకే ఇవ్వాలి
జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కు వినతి
ఏపీ గిరిజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి" కూడా రాధాకృష్ణ"
RTVNEWS( లవకుశ)అల్లూరిజిల్లా కేంద్రమైన పాడేరుమెడికల్ కళాశాలలో 244 పోస్టులు నిరుద్యోగ ఆదివాసులతోనే భర్తీ చేయాలని డిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ కు వినతి పత్రం అందించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ తెలిపారు. శనివారం విలేకరులకు విడుదల చేసిన ప్రకటనలో రాధాకృష్ణ మాట్లాడుతూ మాట్లాడుతూ అల్లూరి జిల్లా పాడేరు మెడికల్ కళాశాలలో ఆదివాసులకు వందకు వంద శాతం ఉద్యోగాల ఆదివాసులు కేటాయించాలని, కళాశాల నిర్మాణానికి స్థలం ఇచ్చిన వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించామన్నారు., ఆదివాసి నిరుద్యోగుల వలసలు అరికట్టేందుకు ఆదివాసి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మెడికల్ కళాశాలలో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో అనేకమంది నిరుద్యోగులు డీడీలు చెల్లించి ఆయా పోస్టులకు అప్లై చేయడం జరిగిందన్నారు. అలాగేఆ డబ్బులు అంత ఏమైంది ఎక్కడ ఉంది అధికారులు నిగ్గు తేల్చి అప్లై చేసిన లబ్ధిదారులకు తిరిగి ఇప్పించాలని కోరారు, అరకులో ఎన్నికలలో ఇచ్చిన హామీలను రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే అమలు చేసే విధంగా ప్రభుత్వంతో మాట్లాడాలని శ్రావణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.