కొయ్యూరు బిజెపి పార్టీ అధ్యక్షుడిగా "సంపరి శివకుమార్ "ఏకగ్రీవంగాఎన్నిక!

Rtv Rahul
0
కొయ్యూరు బిజెపి మండల పార్టీ అధ్యక్షుడిగా "సంపరి శివకుమార్"

ఏకగ్రీవంగా ఎన్నిక. ఎన్నికల అధికారులు పాంగిరాజరావు, కూడా కృష్ణారావు




RTVNEWS (లవకుశ)భారతీయ జనతా పార్టీ కొయ్యూరు మండలం అధ్యక్షుడిగా సంపరి శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు జిల్లా అధ్యక్షులు పాంగిరాజారావు పాడేరు అసెంబ్లీ కన్వీనర్ ట్రై కార్ డైరెక్టర్ కూడా కృష్ణారావు తెలిపారు. శనివారం స్థానిక విలేకరులకు పత్రిక ప్రకటన విడుదల చేశారు. కొయ్యురు జడ్పీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మండల అధ్యక్ష ఎన్నికల సమావేశంలోరాజారావు ,కృష్ణారావు మాట్లాడుతూ.  కొయ్యూరు మండలం శరభన్నపాలెం గ్రామానికి చెందిన సంపరి శివకుమార్ మండల పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికయ్యారని తెలిపారు. శివకుమార్ మండల పార్టీ అధ్యక్షుడిగా మూడు సంవత్సరాల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగుతాని తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ నూతన అధ్యక్షుడు సంపరి శివకుమార్ మాట్లాడుతూ మండలంలో భారతీయ జనతా పార్టీని గ్రామస్థాయి నుండి మరింత బలోపేతం చేసేందుకు అందరు సూచనలు సలహాలతో ముందుకు తీసుకు వెళ్లేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు తోడుగా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు తోడ్పడు అందించాలని ఆయన కోరారు. అలాగే మండల బిజెపి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎన్నికల అధికారులుగా పాల్గొన్న పాంగి రాజారావు కూడా కృష్ణారావు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ మాజీ అధ్యక్షుడు మురుకుర్తి అప్పలరాజు. బిజెపి గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరిమెల రాజు, నాయకులు లోకుల అచ్యుతవాణి, మచ్చల మంగ తల్లి, మేడిపోయిన చిన్న బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">