ఎమ్మార్పీ ధరలకే మధ్యం
విక్రయాలు .
చింతపల్లి ఎక్సైజ్ సీఐ కూర్మారావు స్పష్టం
RTVNEWS( లవకుశ) కొయ్యూరు మండల కేంద్రమైన రాజేంద్రపాలెం కులశేఖర్ వైన్స్ షాప్ లో ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయిస్తున్నట్టు, ఎటువంటి అధిక ధరలకు విక్రయించలేదంటూ విచారణలో వెల్లడైందని చింతపల్లి ఎక్సైజ్ సీఐ కూర్మా రావు స్పష్టం చేశారు. అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం మండల కేంద్రానికి వచ్చిన చింతపల్లి ఎక్సైజ్ సీఐ కూర్మారావు, ఎస్ఐ శ్రావణి, హెడ్ కానిస్టేబుల్ రవితేజ, నర్సీపట్నం మొబైల్ హెడ్ కానిస్టేబుల్ మాణిక్యాలరావు, శ్రీనివాస్ విచారణ నిర్వహించారు. విచారణ అనంతరం సీఐ మాట్లాడుతూ - ఎమ్మార్పీ ధరలకు తమకు మద్యం విక్రయిస్తున్నారని కొంతమంది వినియోగదారులు స్పష్టం చేసినట్టు తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా అధిక ధరలకు విక్రయించినా, బెల్టు షాపులు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ కూర్మారావు హెచ్చరించారు. ఈ విచారణలో పలువురు వినియోగదారుల స్టేట్మెంట్లను రికార్డ్ చేసినట్టు ఆయన వివరించారు.ఈ విచారణ లో స్థానికులు పలువురు హాజరై ఎక్సైజ్ అధికార్లు కు తమ స్టేట్ మెంట్ ను తెలపగా పోలీసులు రికార్డు చేసుకున్నారు.