కొయ్యూరులో మద్యం అధిక ధరలు అమ్మడం అవాస్తవం

Rtv Rahul
0
మధ్యం అధిక ధరలు 
 అవాస్తవం సుమీ...! 



RTVNEWS (లవకుశ)కొయ్యూరు మండల కేంద్రమైన రాజేంద్రపాలెం కులశేఖర్ వైన్స్  షాపులో మద్యాన్ని  అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ  జరుగుతున్న ప్రచారంలో  వాస్తవం లేదని నిర్ధారణ అయింది. ఈ సంక్రాంతి పండగ సందర్భంగా విక్రయాలు అధికమవడంతో  ఒక దశలో మద్యం స్టాక్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలో కొంతమంది స్థానికులు మద్యం కొలుగోలుకై పోటీ పడిన తరుణంలో కొంతమందికి మద్యం కొరత ఏర్పడింది. ఇదే సమయంలో యజమాని కూడా లేకపోవడంతో సేల్స్ బాయ్  అరువు ఎట్టి పరిస్థితుల్లో  లేదని  చెప్పడంతో ఆగ్రహించిన కొంతమంది కొనుగోలుదారులు ఉద్దేశపూర్వకంగానే  మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేసినట్టు తెలింది . ఈ విషయమై సేల్స్ బాయ్ పల్లోజు నూకరాజును వివరణ కోరగా... వరుసగా పండగ రెండు రోజులు మద్యం డిపోలు సెలవు కావడంతో  మద్యం స్టాకు కొరత ఏర్పడిందని,  మద్యం అధిక ధరలకు విక్రయించారనడంలో ఎటువంటి వాస్తవం లేదని వివరణ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">